Site icon NTV Telugu

CM Chandrababu: ఏపీ ప్రజల తరపున సింగపూర్ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పిన సీఎం..

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: సింగపూర్‌ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తరఫున థాంక్స్ చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్‌ ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది అంటూ ఆ దేశ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మంత్రి టాన్సీ లెంగ్ ప్రకటించడంపై ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆయన.. సోషల్‌ మీడియా వేదికగా.. వివిధ అభివృద్ది ప్రాజెక్టుల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధమన్న సింగపూర్ మంత్రి టాన్సీ లెంగ్ ప్రకటనకు ధన్యవాదాలు తెలిపారు.. ఎక్స్ వేదికగా సింగపూర్ మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ ప్రజల తరపున సింగపూర్ ప్రభుత్వానికి.. మంత్రి టాన్సీ లెంగ్ కు ధన్యవాదాలు చెప్పారు..

Read Also: Child Marriage: ఈ పెద్దోళ్లున్నారే.. మునిమనవడిని చూడాలని నానమ్మ కోరిక.. మనుమరాలి పెళ్లికి ఏర్పాట్లు.. కట్ చేస్తే..

ఏపీ సుస్థిరాభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వంతో భాగస్వామిగా ఉండడానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషం.. వివిధ రంగాల్లో ఏపీ-సింగపూర్ కలిసి పని చేయడానికి టాన్సీ లెంగ్ తో జరిపిన చర్చలు బాటలు వేశాయని పేర్కొన్నారు చంద్రబాబు. అగ్రీ-ఫుడ్, ఉత్పాదక రంగం, రెన్యూవబుల్ ఎనర్జీ, పోర్టులు, డిజిటల్, ఇన్నోవేషన్, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కలిసి పని చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయి. 90వ దశకం నుంచి సింగపూర్ ప్రభుత్వంతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం చాలా విలువైనది అని తెలిపారు.. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో.. ఆధునిక మౌళిక వసతుల కల్పనలో సింగపూర్ ప్రభుత్వం నుంచి చక్కటి సహకారం అభిలషిస్తున్నాం. కొన్ని పరిణామాల వల్ల సింగపూర్ భాగస్వామ్యంతో చేసే అభివృద్ధి ప్రయాణంలో కొంత ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఏపీలో ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పుతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంకల్పం తీసుకున్నాం అన్నారు..

Read Also: Delhi Rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

ఇక, స్వర్ణాంధ్ర-2047 సాధన దిశగా అడుగులు వేస్తున్నాం అని పేర్కొన్నారు చంద్రబాబు.. వివిధ రంగాల్లో సింగపూర్ దేశ విధానాలు మాకెప్పుడూ స్పూర్తినిస్తూనే ఉంటాయి.. పట్టణ, గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా మేం వేసుకున్న ప్రణాళికలకు సింగపూర్ తోడైతే ప్రజల ఆశలను నెరవేర్చగలం అన్నారు.. పరస్పరం గౌరవించుకుంటూ వివిధ రంగాల్లో అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేద్దాం.. అంటూ ఎక్స్‌లో పేర్కొన్నారు (ట్వీట్‌ చేశారు) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version