NTV Telugu Site icon

CM Chandrababu: ఐటీ పాలసీపై ముగిసిన సీఎం సమీక్ష.. 20 లక్షల మందికి ఉపాధి హామీని నెరవేర్చేలా ప్రణాళిక..!

Babu

Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఐటీ పాలసీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ పాలసీపై నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది.. ఏపీని ఐటీ హబ్ చేసేలా పాలసీ రూపకల్పన పై ప్రధానంగా చర్చించారు సీఎం.. ఏపీలో ఏఐ కంపెనీల స్థాపనకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలుపై ఉన్నతాధికారులతో చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఐటీ సేవల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చని భావిస్తోన్న సర్కార్.. ఆ దిశగా ఈ సమావేశంలో కసరత్తు చేసింది.. ఐటీ సేవలు.. ఏపీ ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పాలసీ రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబాబు.. ఐటీ రంగం ద్వారా భారీగా ఉపాధి కల్పించి.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 20 లక్షల మందికి ఉపాధి హామీని నెరవేర్చేలా ప్రణాళిక రూపొందించాలని.. ఆ దిశగా ప్లాన్‌ చేయాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Read Also: Maharastra : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కార్యాలయంపై దాడి.. పారిపోయిన నిందితురాలు