Site icon NTV Telugu

CM Chandrababu: జనాభా భారం కాదు.. జనమే ఆస్తి.. అదే అతి పెద్ద పెట్టుబడి..

Babu

Babu

CM Chandrababu: జనాభా భారం కాదు.. జనమే ఆస్తి.. అదే అతి పెద్ద పెట్టుబడిగా అభివర్ణించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ సచివాలయం దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి సారి ఆంధ్రప్రదేశ్ లో జనాభా దినోత్సవం ఫోకస్ తో జరుగుతోంది.. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అని గురజాడ అప్పారావు చెప్పారు. దేశమంటే మనుషులు.. కష్టాలు.. సమస్యలు.. పరిష్కారం అన్నీ ఉంటాయి.. గురజాడ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి.. ఇద్దరు పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని నేనే చట్టం తీసుకొచ్చా.. కానీ, ఒక్కోసారి పాలసీలు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.. ఇప్పుడు జనాభా భారం కాదు.. జనమే ఆస్తి అన్నారు చంద్రబాబు.

Read Also: Himachal Floods: హిమాచల్‌ను ముంచెత్తిన వరదలు.. 150 కి.మీ దూరంలో మృతదేహాలు లభ్యం

జనాభా తక్కువుంటే అవసరాల నిమిత్తం ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్తారు.. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాలు ఉంటాయి.. జనాభా పెరిగితే పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి, అవకాశాలు ఉంటాయి అన్నారు సీఎం చంద్రబాబు.. ఇక, నేనెప్పుడూ మహిళా పక్షపాతిని.. ఆస్తిలో మహిళలకి సమానహక్కు కలిపించి ఎన్టీఆర్ మహిళల పక్షాన నిలబడ్డారు.. జనాభా నిర్వహణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.. త్వరలో జనాభా నిర్వహణపై డ్రాఫ్ట్ పాలసీ తీసుకొస్తామని వెల్లడించారు.. అయితే, మితి మీరిన నియంత్రణ చర్యలు వల్ల చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.. ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తాం అని చెప్పి 15 వేలు ఇస్తున్నాం అన్నారు.. జనాభా పెరుగుదల కోసం అందరు కృషి చేయాలి.. చైనా జనాభా నియంత్రణ వలన చాలా నష్ట పోయింది.. జనాభా పెరుగుదల కోసం అందరం మాట్లాడాలని సూచించారు.

Read Also: Kapil Sharma : కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు – హింసను ఖండించిన నిర్వాహకులు

దక్షిణ భారత దేశంలో నియోజక వర్గాల సీట్లు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నాయి.. దానికి కారణం జనాభా నియంత్రణ చర్యలు… ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించే పథకాలు అమలు చేయాలన్నారు సీఎం చంద్రబాబు.. నా తల్లి కట్టెల పొయ్యి మీద అన్నం వండి ఇబ్బంది పడింది.. అందుకే నా ఆడపడుచులకు ఉచిత గ్యాస్ సిలిండర్ లు ఇచ్చాను.. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు స్వయం సమృద్ధి సాధించారు.. శక్తి సామర్ధ్యాల్లో మహిళలలు తక్కువ కాదు.. జనాభా లో 50 శాతం మహిళలు ఉన్నారు.. మహిళలకు గతంలో కూలీ తక్కువగా ఇచ్చే వారు.. ఆర్టిసీ బస్సులో కండక్టర్లు గా మహిళలకు రిజర్వేషన్లు కల్పించాను అని గుర్తుచేశారు.. ఒకప్పుడు జనాభా నియంత్రణ అన్నాం.. కానీ ఇప్పుడు జనాభా నిర్వహణ అంటున్నాం.. తిరిగి ఉమ్మడి కుటుంబాలు రావాలి.. దాని కోసం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి.. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించే విధంగా పథకాలు తీసుకువస్తాం.. పాపులేషనే మనకు ఒక పెద్ద ఆస్తి.. జనాభా నే మనకు అతి పెద్ద పెట్టుబడి.. ఇప్పుడు చాలా దేశాల్లో వయసు మళ్లిన వారే అధికంగా ఉన్నారు.. ఇప్పటి నుంచి భావి తరాల భవిష్యత్ కోసం జనాభా నిర్వహణ కోసం అందరు సహకరించాలి.. మొన్నటి వరకు ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పని చేశాం.. ఇక పాపులేషన్ మ్యానేజ్మెంట్ కోసం పని చేయాలని అని పిలుపునిచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version