NTV Telugu Site icon

CM Chandrababu: ఇకపై భవిష్యత్తు మొత్తం భారత్‌దే.. మరో 40 సంవత్సరాలు మనదే..!

Babu

Babu

CM Chandrababu: ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తోంది.. ఇకపై భవిష్యత్తు మొత్తం భారత్‌దే అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఐఐటీ మద్రాస్ లో “అల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025” లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తోంది.. ఇకపై భవిష్యత్తు మొత్తం ఇండియాదే అన్నారు.. మద్రాసు ఐఐటీలో 30-40 శాతం పైగా తెలుగు విద్యార్థులే చదువుతున్నారు.. మద్రాసు ఐఐటి దేశంలో నెంబర్ వన్ గా ఉంది.. ఇక్కడ నుండి ఎనబై శాతం స్టార్టప్ విజయవంతం అవుతున్నాయి.. మద్రాస్ ఐఐటీ స్టార్టప్ అగ్నికుల్ మంచి విజయాన్ని అందుకున్నాయని తెలిపారు..

Read Also: IPL 2025: ఆర్‌సీబీ ఆటగాళ్లకు డీకే ఆతిథ్యం.. గ్రాండ్‌గా పార్టీ, వీడియో వైరల్!

ఇక, ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్ధిక ముఖచిత్రాన్ని మార్చివేశాయి‌‌.. 1991 ఆర్థిక సంస్కరణలు ఎంపిక కాదు‌‌ తప్పని సరి‌‌ అన్నారు సీఎం చంద్రబాబు.. రాజకీయ సంస్కరణ సంస్కరణ వల్ల సోవియట్, రష్యా అనేక దేశాలుగా విడిపోయింది ‌.. చైనా, ఇండియా ఆర్థిక సంస్కరణలు తరువాత అభివృద్ధి బాట పట్టాయన్నారు.. కమ్యూనికేషన్ రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఒక గేమ్ చేంజర్ గా మారిందన్న ఆయన.. మైక్రోసాఫ్ట్ సీఈవో ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వ్యక్తి అని గుర్తుచేశారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిమానిటేషన్ ద్వారా సంస్కరణలు తీసుకుని వచ్చారు‌.. డిజిటల్ కరెన్సీ పై ఓ నివేదికను ప్రధానమంత్రికి అందించానని వెల్లడించారు. జపాన్, యూరప్, చైనా జనాభా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. జనాభా తగ్గుదల వల్ల చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు.. భారతదేశానికి గొప్ప వరం డెమోగ్రఫిక్ డివిడెండ్.. భారతదేశానికి అలాంటి ఇబ్బందులు లేవు మరో 40 సంవత్సరాలు మనదే అన్నారు.. 2047 నెంబర్ గా ఇండియా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. భారతీయులు ఎక్కడ.. ఎలాంటి వాతావరణం అయినా.. తట్టుకొని నిలబడి పనిచేయగల సత్తా మనకే ఉందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..