CM Chandrababu Delhi Visit: మరోసారి హస్తినకు సీఎం చంద్రబాబు.. అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ

  • మరోసారి హస్తిన పర్యటనకు సీఎం చంద్రబాబు..
  • ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
  • రేపు ఐదుగురు కేంద్ర మంత్రులను కలవనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు...
Cbn

Cbn

CM Chandrababu Delhi Visit: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తినకు వెళ్లనున్నారు.. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు బయల్దేరి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.. ఈ సారి ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం రోజు అంటే రేపు ఐదుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతారు. కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో సహా పలువురితో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చిస్తారు. ఈ వరుస సమావేశాల అనంతరం రేపు సాయంత్రం 5 గంటలకు అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు సీఎం చంద్రబాబు నాయుడు..

Read Also: Constituency Rankings: 175 నియోజకవర్గాలకు ర్యాంకులు.. సీఎం, డిప్యూటీ సీఎం స్థానాలు ఎంతో తెలుసా?