NTV Telugu Site icon

CM Chandrababu: మిర్చి యార్డ్ అధికారులు, ట్రేడర్స్ తో భేటీకి సిద్ధమైన సీఎం చంద్రబాబు..

Cbn

Cbn

CM Chandrababu: మిర్చి ధరలు పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.. ఇక, పాలక, ప్రతిపక్ష నేతల ఎంట్రీతో.. మిర్చి ధరలకు రాజకీయరంగు పులిమినట్టు అయ్యింది.. ఇప్పటికే మిర్చి రైతుల దుస్థితిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రేపు మిర్చి యార్డ్ అధికారులతో, ట్రేడర్స్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.. ఈ ఏడాది మిర్చి ధరల పతనంతో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం… ఐదు లక్షల ఎకరాల్లో ఈ ఏడాది మిర్చి సాగైనట్టు అంచనాలు ఉండగా.. 12 లక్షల మెట్రిక్ టన్నుల్లో.. ఇప్పటికే నాలుగు లక్షల మెట్రిక్ టన్నులను వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి.. ఇక, మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.. ఎప్పుడూ లేనంతగా రేట్లు పడిపోవడం.. దీనిపై రాజకీయంగా విమర్శలు.. రైతుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న తరుణంలో రంగంలోకి దిగింది ఏపీ ప్రభుత్వం.. రేపు వ్యాపారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడి ధరల పతనానికి కారణాలను తెలుసుకోనుంది సర్కార్‌.. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలపై మిర్చి రైతుల్లో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది..

Read Also: Fakhar Zaman: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఫఖర్ ఔట్.. ఏడుస్తున్న వీడియో వైరల్