NTV Telugu Site icon

CM Chandrababu Naidu: కీలక అంశాలు వెల్లడించిన సీఎం చంద్రబాబు..

Cbn

Cbn

CM Chandrababu Naidu: స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కీలక అంశాలను ప్రస్తావించారు.. గత ప్రభుత్వంలో అన్న వ్యవస్థలు నాశనం అయ్యాయని విమర్శించిన ఆయన.. కూటమి ప్రభుత్వం క్రమంగా అన్ని గాడిలో పెడుతుందన్నారు.. ఒకటో తేదీనే జీతాలిస్తున్నాం. ఏడు అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేశాం. ఇసుక, మద్యం దోపిడీ ఎలా జరిగిందో వివరిస్తాం. అన్ని అక్రమాలపై సమగ్ర విచారణ చేపడతాం. అక్రమార్కులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.. రాష్ట్రానికి సాయం చేసిన కేంద్రానికి కూటమి ప్రభుత్వం ధన్యవాదాలు తెలుపుతోంది. 53 లక్షల కుటుంబాలకు మేలు జరిగేలా ఉపాధి హామీ పని దినాలను పెంచారు. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం, తెలంగాణతో సంప్రదింపులు జరుపుతున్నాం. 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నాం. వికసిత్ భారత్ లో ఏపీ భాగస్వామ్యం కానుంది. హైదరాబాదులో 2020 విజన్ ఫలితాలు చూపుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో నాడు తెచ్చిన పాలసీలను ఆ తర్వాత ప్రభుత్వాలు కొనసాగించాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పని చేస్తాం అన్నారు.

Read Also: Daggubati Purandeswari: కుట్రలు జరుగుతున్నాయి.. భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలి..

ఇక, జులై నెలలోనే ఏపీ ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టి పొలాలకు అందిస్తాం అన్నారు చంద్రబాబు.. స్వర్ణ చతర్భుజీ స్ఫూర్తితో నదుల అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తాం. జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం అవసరం అన్నారు.. ఏపీలో కృష్ణా, గోదావరి, నాగావళి, వంశధార, పెన్నా నదుల అనుసంధానం చేస్తాం. పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం రూ. 990 కోట్లు అవసరం. కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరిపి పోలవరం పూర్తి చేస్తాం అన్నారు.. ఇంధన రంగాన్ని బలోపేతం చేస్తాం. విద్యుత్ రంగానికి హై ప్రయార్టీ. సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకుంటాం. కొత్త ఇంధన పాలసీ రాబోతోంది. అన్ని చోట్లా సోలార్ పవర్ ను ప్రొత్సహిస్తాం. సోలార్ పవర్ ద్వారా ఆదాయం వచ్చేలా చేస్తాం. గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్ గా ఏపీని మారుస్తాం అన్నారు.

Read Also: Snake Byte: ప్లాస్టిక్ బ్యాగ్ లో పామును తీసుకొచ్చి ఆస్పత్రిలో హంగామా చేసిన యువకుడు..

రూ. 1674 కోట్ల మేర ధాన్యం బకాయిలు చెల్లించాం.. రైతులకు ప్రతి అడుగులోనూ సాయం అందిస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.. అన్నదాత పథకం కింద ఏడాదికి రూ. 20 వేలు అందిస్తాం. గత ప్రభుత్వ టెర్రరిజం వల్ల పరిశ్రమలు వెళ్లిపోయాయి. ఆ కంపెనీలను మళ్లీ రప్పిస్తాం. కొత్త ఇండస్ట్రీయల్ పాలసీలు తెస్తాం. కొత్తగా 100 ఇండస్ట్రీయల్ పార్కులు ఏర్పాటుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో కరోనా కంటే కూడా నాటి ప్రభుత్వ అసమర్థత వల్లనే టూరిజం రంగానికి ఎక్కువ నష్టం జరిగింది. తెలుగుదేశం హయాంలో టూరిజం శాఖపై రూ.880 కోట్లు ఖర్చు చేయగా.. గత ప్రభుత్వం కేవలం రూ. 213 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. తమ విలాసాల కోసం రుషికొండ లో ప్యాలెస్ ను నిర్మించుకున్నారు తప్ప.. పర్యాటక రంగంపై శ్రద్ధ చూపలేదు. రిషికొండ ప్యాలెస్ కోసం పెట్టిన ఖర్చులో సగం కూడా గత ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధిపై పెట్టకపోవడం విచారకరం అన్నారు. టూరిజం అభివృద్ధి అనేది సామాన్య ప్రజలకు ఉపాధి కల్పనలో అత్యంత కీలకమైనది. మళ్లీ పర్యాటక రంగానికి మన ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకువస్తుందన్నారు.

Read Also: Rythu Bharosa: గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి.. త్వరలో రైతు భరోసా..

రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పెట్టుబడిదారులను మళ్లీ వెనక్కి తీసుకువస్తాం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో ఎకో, టెంపుల్, బీచ్ టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మారుస్తాం. గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తమైన విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించాం. ప్రధానంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించాం. బడి ఈడు పిల్లలు ఎవరూ విద్యకు దూరంగా ఉండకూడదు అనేది మా విధానం. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు విద్యార్థుల సిలబస్ లో మార్పులు చేస్తాం. భాష లేనిదే జాతి ఉనికి ఉండదు. ఇంగ్లీషుకు ప్రోత్సాహం ఇస్తూనే ప్రాథమిక స్థాయి నుంచి మాతృ భాష తెలుగుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. తెలుగు భాష వెలగాలనేది మా సిద్ధాంతమని స్పష్టం చేశారు..

Read Also: Daggubati Purandeswari: కుట్రలు జరుగుతున్నాయి.. భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలి..

విద్యార్థులకు అందే పథకాలకు “తల్లికి వందనం”, “సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర”, “డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి. భోజనం”, “మన బడి- మన భవిష్యత్తు”, “బాలికా రక్ష”, “అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం” అసి పేర్లు పెట్టాం అని వివరించారు సీఎం చంద్రబాబు.. 2014 -19 నాటి పాత ఫీజు రీయింబరెస్మెంట్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాం. దీంతో ప్రభుత్వమే నేరుగా కళాశాలల ఖాతాల్లో ఫీజు రీయింబరెస్మెంట్ ను జయ చేస్తుంది. దీంతో విద్యార్థులకు ఎటువంటి ఫీజుల సమస్యలు ఉండవు. ఉపాధ్యాయులు బోధనపై దృ పెట్టడం కోసం టీచర్లపై అనవసర యాప్ ల భారం తొలగించాం.. వైద్య, ఆరోగ్య శాఖలో 2014 నుంచి 2019 వరకు నాటి పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలు అన్నీ మళ్లీ అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించాం. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తాం. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తాం. గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్య శ్రీ బిల్లుల బకాయిలు దశలవారీగా చెల్లిస్తున్నాం. టెలీ మెడిసిన్ ను విస్తృత పరిచి మెరుగైన వైద్య సేవలు అందిస్తాం అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్ ల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేస్తాం. గిరిజన గర్భిణీలను వసతి కేంద్రాలకు తరలించి పౌష్టికాహారం అందిస్తాం. తద్వారా మాతాశిశు సంరక్షణ చేపడతాం. “ఎన్టీఆర్ బేబీ కిట్స్” ను తిరిగి ప్రవేశ పెడతాం అన్నారు.

Read Also: Rythu Bharosa: గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి.. త్వరలో రైతు భరోసా..

ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ధరల భారం పడకుండా చూస్తున్నాం. గత ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా అవినీతికి కేంద్రంగా మార్చుకుంది. రేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు సీఎం చంద్రబాబు.. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేదలు అల్లాడిపోయారు. అందుకే కూటమి ప్రభుత్వం మళ్లీ పౌర సరఫరాల శాఖను బలోపేతం చేస్తోంది. నిత్యావసరాల ధరలను నియంత్రిస్తాం. ప్రస్తుత సమాజంలో మారుతున్న పోకడలకు అనుగుణంగా దేశంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టాం. జనాభా పెరుగుదలను తగ్గించేందుకు రెండు దశాబ్దాల క్రితం చొరవ తీసుకుని పలు కార్యక్రమాలు అమలు చేశాం. అయితే నేడు జనాభా వృద్ధిపై దృష్టి పెట్టాలి. లేకపోతే రానున్న రోజుల్లో వృద్ధుల సంఖ్య పెరిగి పనిచేసే వాళ్ల సంఖ్య తగ్గుతుంది. ఇది దేశ ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా జనాభా నియంత్రణ నుంచి జనాభా సమతుల్యత దిశగా అడుగులు వేసేందుకు నిర్ణయించాం. అందుకే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను తొలగించాం అన్నారు. సంతానోత్పత్తిలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంతో సహా దక్షిణాది రాష్ట్రాలు ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాయి. యువ భారత్ కోసం డెమోగ్రఫిక్ మేనేజ్ మెంట్ ఆవశ్యకతను గుర్తించి ముందుకు సాగుదాం అన్నారు.

Read Also: Sitarama Project: దశాబ్దాల సాగు నీటి కల సాకారం.. సీతారామ ప్రాజెక్ట్‌ కు సీఎం రేవంత్ ప్రారంభోత్సవం..

ప్రజల జీవితాలు మార్చేందుకే టెక్నాలజీ అవసరం అన్నారు సీఎం చంద్రబాబు.. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తే పాలనలో అద్భుతాలు సృష్టించవచ్చు. పేదల బతుకుల్లో పెను మార్పులు తేవచ్చు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచవచ్చు. టెక్నాలజీకి ఉత్తమ ప్రభుత్వ పాలసీలు తోడైతే అనూహ్యమైన విజయాలు సాధించవచ్చు. భారతదేశంలో టెక్నాలజీ ఉపయోగం పెరగడం వల్ల పేదరికం తగ్గిందని ఇటీవలే ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ను సమర్థవంతంగా వినియోగించుకుని సత్వర, పారదర్శక పాలన అందించవచ్చు అన్నారు.. P4 తో పేదరిక నిర్మూలన. జీరో పావర్టీ కోసం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నాం. పేదరికం లేని సమాజం టీడీపీ విధానం అన్నారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న 10 శాతం మంది, అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతను ఇవ్వడం ద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చు. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం. మా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కు అత్యంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. “zero tolerance” (జీరో టాలరెన్స్) అని స్పష్టం చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో మత ఘర్షణలు, రౌడీయిజం, ఫ్యాక్షనిజం, నక్సలిజాన్ని నిర్మూలించిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. నేడు మళ్లీ లా అండ్ ఆర్డర్ ను అత్యంత కట్టుదిట్టంగా అమలు చేస్తాం. రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు బాగుండాలి. నేరస్తులు రాజకీయ ముసుగులో వచ్చి రౌడీయిజం చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.