NTV Telugu Site icon

AP Crime Rate: ఏపీలో పెరిగిన క్రైమ్‌ రేట్.. 2014-19తో పోల్చితే 2019-24 మధ్య 46.8 శాతం ఎక్కువ..!

Ap

Ap

AP Crime Rate: ఆంధ్రప్రదేశ్‌లో క్రైమ్‌ రేట్‌ భారీగా పెరిగిపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి.. ఈ రోజు హోం శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశానికి హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమల రావు, హోంశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా.. 2014-19తో పోల్చితే 2019-24 మధ్య క్రైం రేటు 46. 8 శాతం పెరిగిందని సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు.. మహిళలపై నేరాలు 36 శాతం, పిల్లలపై క్రైం 152 శాతం, మిస్సింగ్ కేసెస్ 84 శాతం, సైబర్ క్రైం నేరాలు 134 శాతం పెరిగినట్టు అధికారులు పేర్కొన్నారు.. ఇక, గంజాయి, డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైంకు అడ్డుకట్ట, టెక్నాలజీ వాడకం, పోలీసు శాఖ బలోపేతం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఏపీలోని శాంతి భద్రతలు, మహిళల రక్షణపై చర్చ. ఆస్పత్రుల్లో గొడవలు జరగ్గకుండా తీసుకోవాల్సిన ప్రత్యేక భద్రత.. గంజాయి నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక ప్రస్తావన తీసుకురానున్నారు.. అదే విధంగా.. ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్-AP ANTF బలోపేతంపై చర్చించనున్నారు సీఎం చంద్రబాబు..

Read Also: Maharashtra: విద్యార్థినులకు పోర్న్‌ వీడియోలు చూపించిన టీచర్..