Cyclone Montha: మొంథా తుఫాన్ విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. సహాయక చర్యల కోసం రెడీగా ఉండాలి అంటూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇవాళ ఉదయం మొంథా తుఫాన్ పరిస్థితులపై మంత్రులు. ఎమ్మెల్యేలు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. తుఫాన్ పరిస్థితి ఎదుర్కోవడానికి మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.. ఈ రాత్రి తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది.. సహాయ చర్యల కోసం రెడీగా ఉండాలి.. ప్రాణ నష్టాన్ని బాగా తగ్గించాలి.. ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..
Read Also: MP Arvind Slams Kavitha: ప్రజలు పిచ్చోళ్లు కాదు.. జాగృతి అధ్యక్షురాలు కవితపై ఎంపీ అరవింద్ ఫైర్..
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మొంథా తుఫాన్ ఎఫెక్ట్ మొదలైంది.. భయానకంగా మారిపోయాయి సముద్రతీర ప్రాంతాలు.. ఉవ్వెత్తున రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి.. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు జోరుగా వానలు కురుస్తున్నాయి.. కోస్తా తీరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి.. అంతకంతకు ఈదురు గాలుల తీవ్ర పెరుగుతోంది.. గాలుల తీవ్రతకు ఇంటి పైకప్పులు ఎగిరిపోతున్నాయి.. వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి.. గాలుల తీవ్రతకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి.. దీంతో, అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు..
