NTV Telugu Site icon

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్, విన్ ఫాస్ట్ ప్రతినిధుల భేటీ.. రాష్ట్రంలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు..!

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వివిధ కంపెనీలతో సమావేశాలు నిర్వహిస్తూ.. రాష్ట్రంలో పెట్టుబడుల ఆహ్వానిస్తున్నారు.. ఇక, ఈరోజు సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్, విన్ ఫాస్ట్ కంపెనీ ప్రతినిధులు వేర్వేరుగా భేటీ అయ్యారు.. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు.. ఏపీలో ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బీపీసీఎల్ సీఎండీ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులతో ఏపీ సీఎం చర్చలు జరిపారు.. ఆయిల్ రిఫైనరి కార్యరూపం దాల్చితే దాదాపు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.. తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలతో బీపీసీఎల్ పెట్టుబడులపై చర్చించారు సీఎం చంద్రబాబు. ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 4, 5 వేల ఎకరాలు అవసరం ఉంటుందని సీఎంకు వివరించారు కంపెనీ ప్రతినిధులు.. అవసరమైన భూములు కేటాయిస్తామని.. 90 రోజుల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన పూర్తి ప్రణాళికతో రావాలని కంపెనీ ప్రతినిధులను కోరారు చంద్రబాబు. ఇక, అక్టోబర్ నాటికి ఫీజిబిలిటీ రిపోర్టుతో వస్తామని సీఎంతో చెప్పారు బీపీసీఎల్ ప్రతినిధులు.

Read Also: Mythri Movie Makers: తెలుగులో ఏకైక నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్

మరోవైపు.. విన్ ఫాస్ట్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం జరిగింది.. విన్ ఫాస్ట్.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వియత్నాంలో ప్రముఖ కంపెనీగా ఉంది.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆ కంపెనీ ప్రతినిధులకు వివరించారు సీఎం చంద్రబాబు.. ఈవీ, బ్యాటరీ తయారీ ప్లాంట్ ను ఏపీలో నెలకొల్పాలని కోరారు.. ప్లాంట్ కు అవసరమైన భూమి, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామన్న ఈ సందర్భంగా విప్‌ ఫాస్ట్‌ ప్రతినిధులకు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

https://x.com/AndhraPradeshCM/status/1811021087419027506

https://x.com/AndhraPradeshCM/status/1811020677669081219