NTV Telugu Site icon

Shakti App: “శక్తి”యాప్‌ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. ఎలా పనిచేస్తుందంటే..?

Shakti App

Shakti App

Shakti App: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల భద్రతకై కొత్త యాప్‌ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఏపీ పోలీస్ శాఖ రూపొందించిన “శక్తి” యాప్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించిన ఆయన.. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ రూపొందించిన ‘శక్తి’ యాప్ ను ప్రారంభించారు.. చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేలా చేనేత రథాన్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీని కూడా ఆవిష్కరించారు ఏపీ సీఎం..

శక్తి యాప్‌ ఎలా పనిచేస్తుంది..?
పలు అధునాతన భద్రతా ఫీచర్లను ఈ “శక్తి” యాప్‌కు జోడించిది ఏపీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌.. మహిళలకు ఆపద కాలంలో అత్యవసర సహాయం అందించేందుకు “శక్తి” యాప్ కీలకంగా పనిచేయనుంది.. వన్ టచ్ SOS బటన్- వెంటనే పోలీసులను అలర్ట్ చేసి సహాయం అందిస్తుంది. Shake Trigger/Hand Gesture SoS- యాప్ ఓపెన్ చేయకుండానే SOS అలర్ట్ పంపించవచ్చు. దీని ద్వారా లైవ్ ట్రాకింగ్ అండ్ ఎవిడెన్స్ షేరింగ్ కాలర్ లోకేషన్, 10 సెకన్ల ఆడియో, వీడియో కంట్రోల్ రూమ్ కి పంపబడుతుంది.. తద్వారా పోలీసు అధికారుల తక్షణమే స్పందించేందుకు దోహదం చేస్తోంది..

శక్తి యాప్‌లో కీ ఫ్యూచర్స్‌..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఈ శక్తి యాప్‌లో కీలకమైన ఫ్యూచర్స్ ఉన్నాయి.. ఫిర్యాదు నమోదు, తప్పిపోయిన పిల్లల గురించి రిపోర్టు చేయడం, అక్రమ కార్యకలాపాలపై రిపోర్టు చేయడం, నైట్ షెల్టర్స్, భద్రతతో కూడిన ప్రయాణం, పోలీసు అధికారుల వివరాలు మరియు మొబైల్ నంబర్లు, వాట్సాప్ గవర్నెన్స్, అత్యవసర కాంటాక్ట్.. ఇలా ఎన్నో అధునాతన ఫీచర్స్ ను ఈ “శక్తి” యాప్ లో పొందుపరిచింది ఏపీ పోలీసుశాఖ. కాగా, ఆడబిడ్డల భద్రత కోసం ప్రత్యేకంగా యాప్ తీసుకువచ్చాం.. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్.. అదే మీకు చివరి రోజు అవుతుంది అంటూ ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.