NTV Telugu Site icon

CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం..

Ap Cm Chandrababu

Ap Cm Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లారు.. ఢిల్లీ వేదికగా ఈ రోజు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు సీఎం.. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై ప్రస్తావించబోతున్నారు. వికసిత్ భారత్-2047లో భాగంగా వికసిత్ ఏపీ-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేపట్టింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో ప్రస్తావించబోతున్నారు.. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో చెప్పబోతున్నారు. ఏపీలో ప్రైమరీ సెక్టార్ పరిధిలోకి వచ్చే వ్యవసాయం, ఆక్వా రంగాలకున్న అవకాశాలను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించనున్నారు ఏపీ ముఖ్యమంత్రి..

Read Also: Suryakumar Yadav: ఇంజిన్ మారిందంతే.. టీమిండియా రైలు మాత్రం దూసుకెళ్తూనే ఉంటుంది!

జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుదలకు తాము పెట్టుకున్న టార్గెట్.. చేపట్టనున్న ప్రణాళికలను నీతి ఆయోగ్‌ సమావేశంలో వివరించరున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. సేవల రంగ అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలను ప్రత్యేకంగా ప్రస్తావించబోతున్నారు.. డిజిటల్ కరెన్సీ అవశ్యకతను నీతి ఆయోగ్ భేటీలో వివరించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ విషయాలపై ఇప్పటికే సీఎం చంద్రబాబుతో సమావేశమై.. ప్రత్యేకంగా చర్చించారు నీతి ఆయోగ్ సీఈవో సుబ్రమణ్యం.. మరోవైపు.. నీతి ఆయోగ్ సమావేశం ముందు, ఆ తర్వాత అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.

Read Also: Astrology: జులై 27, శనివారం దినఫలాలు

కాగా, ప్రధాని మోడీ అధ్యక్షతన ఈరోజు తొమ్మిదవ “నీతి ఆయోగ్” పాలక మండలి సమావేశం కానుంది.. రాష్ట్రపతిభవన్ లోని “కల్చరల్ సెంటర్” లో సమావేశం అవుతుంది.. ఈ సమావేశాన్ని తెలంగాణ సహా 6 రాష్ట్రాలు బహిష్కరించాయి.. అయితే, “నీతి ఆయోగ్” స్థానంలో పూర్వ “ప్రణాళిక సంఘం” ను పునరుద్దరించాలని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ డిమాండ్‌ చేస్తున్నారు.. ఇక, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం మధ్య పరస్పర సహకారం తోపాటు, భాగస్వామ్య పాలనతో, సేవలందించే ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా, గ్రామీణ, పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మరింతగా పెంచే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తామని కేంద్రం అంటుండగా.. ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, సభ్యులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టనెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు.. కానీ, కేంద్ర బడ్జె్‌ట్‌లో తమకు అన్యాయం జరిగిందంటూ బీజేపీయేతర సీఎంలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే..