Site icon NTV Telugu

Chandrababu: అబుదాబీలో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు..

Cbn Networking Lunch In Abu

Cbn Networking Lunch In Abu

Chandrababu: అబుదాబీలో పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల సీఈఓలతో నెట్ వర్కింగ్ సమావేశంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు… మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఈ సమావేశం అయ్యారు.. అబుదాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్‌జాబీతో చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు.. వైజాగ్ లో జరిగే పెట్టుబడుల సదస్సుబుకు సంబంధించి చర్చ జరిగింది.. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు… ఏపీకి పెట్టుబడులకు సంబంధించి చర్చించారు. మొత్తంగా యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబీలో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పయనిస్తోందని.. రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు సీఎం చంద్రబాబు..

Read Also: Janhvi Kapoor : రామ్ చరణ్‌, ఎన్టీఆర్ మీదనే జాన్వీకపూర్ ఆశలు..

ఏపీ రాజధాని అమరావతి కొత్త అవకాశాలకు, ఇన్నోవేషన్‌కు కేంద్రంగా ఉంటుందని వివరించారు సీఎం చంద్రబాబు.. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు.. రాష్ట్రంలో త్వరలో పర్యటిస్తామని, పెట్టుబడులపై ఆలోచన చేస్తామని చంద్రబాబుకు తెలిపారు ప్రతినిధులు.. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) ప్రతినిధులతోనూ సీఎం భేటీ అయ్యారు.. ఇక, భారతదేశంలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఏడీఎన్‌ఓసీ ఆసక్తి చూపింది.. ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించిన చంద్రబాబు.. దక్షిణాసియాకు చేరువగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన వ్యూహాత్మక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వివరించారు.. పెట్రో కెమికల్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉందన్నారు..

Read Also: ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కేసీఆర్ కీలక సమావేశం!

అనంతరం అబుదాబీలోని పారిశ్రామిక వేత్తలతో నెట్వర్క్ లంచ్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పాల్గొంది.. జీ 42 సీఈవో మనుకుమార్ జైన్, ఏడీఐసీ గ్లోబల్ హెడ్ లలిత్ అగర్వాల్, ఐహెచ్‌సీ సీఈవో అజయ్ భాటియా, డబ్ల్యుఐవో బ్యాంక్ సీఈవో జయేష్ పాటిల్.. పాలిగాన్ మార్ఫిక్ సీఈవో జయంతి కనాని, ట్రక్కర్ సీఈవో గౌరవ్ బిశ్వాస్, పాలసీ బజార్ గ్రూప్ సీఈవో యశిష్ దహియా, ఇన్స్యూరెన్స్ మార్కెట్ సీఈవో అవినాష్… ఇన్సార్ట్స్ సీఈవో అజార్ ఇక్బాల్, జీఐఐ సీఈవో పంకజ్ గుప్తా, నూన్ సీఈవో ఫరాజ్ ఖలీద్, ఇన్సెప్షన్ సీఈవో ఆశీష్ కోషితో నెట్వర్క్ లంచ్‌ సమావేశం జరిగింది..

Exit mobile version