CM Chandrababu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. కాసేపట్లో వాజపేయి సమాధి సదైవ్ అటల్ వద్ద నివాళులు అర్పించనున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ కూటమి పక్షాల నేతల సమావేశానికి హాజరుకానున్నారు చంద్రబాబు.. అటు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విడివిడిగా భేటీ కానున్నారు. ఆతర్వాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌తో రాష్ట్ర అంశాలపై చర్చించనున్నారు. ఇటీవలే ఏపీ రాజధాని కోసం మంజూరైన రైలుమార్గం పనులు.. వీలైనంత వేగంగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని.. రైల్వేమంత్రిని కోరనున్నారు చంద్రబాబు. అటు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి ఆర్థిక తోడ్పాటుతో పాటు పెండింగ్ నిధుల విడుదలపైనా.. కేంద్ర ఆర్థికమంత్రితో చర్చించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. కాగా, రెండు రోజుల దేశ రాజధాని పర్యటన కోసం నిన్న రాత్రే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్న విషయం విదితమే..
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?