AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో 21 అంశాలపై చర్చ జరిగింది. అమరావతి నిర్మాణం కోసం చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. హడ్కో ద్వారా రూ.11వేల కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్ అప్రూవల్ వచ్చింది. జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ ద్వారా రూ.5వేల కోట్ల రుణానికి ఆమోదం లభించింది. 45 పనులకు రూ.33వేల కోట్ల నిధులు ఖర్చు చేసేందుకు సీఆర్‌డీఏకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. బుడమేరు, పది జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌కు ఆమోదం తెలిపింది. ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్ ద్వారా రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకోడానికి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ఎడమ కాల్వ రీటెండర్‌కు అనుమతి లభించింది. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం చేతకానితనం వల్ల జల్ జీవన్ మిషన్ నిర్వీర్యం అయిందన్నారు మంత్రి పార్ధసారథి. ఆ పనుల పరిశీలన తర్వాత ప్రాజెక్టులు తిరిగి చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
Read Also: Speaker Ayyanna Patrudu: దొంగ పెన్షన్లతో ప్రభుత్వానికి నెలకు రూ.120 కోట్ల నష్టం..!
క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని మంత్రమండలిలో నిర్ణయించారు. రూ.1 కోటీ 70 లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ల ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. రాష్ట్రంలోని 475 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆమోదం తెలిపారు. 1.41 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇక, ఇప్పటి వరకూ డోలాయమానంలో ఉన్న అమరావతికి వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నిధులు ఇచ్చాయి.. 45 ఇంజనీరింగ్ పనులు 33,137 కోట్లతో పూర్తి చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు మంత్రి పార్థసారథి.. గ్రామకంఠ భూముల సర్వే, రికార్డింగ్ లో 48,899 సబ్ డివిజన్ చేయడానికి అర్జీలు వచ్చాయి.. వాటికి ఫీజు రాయితీ ఇస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నా యన.. వరదల్లో ముంపుకు గురైనవారి రుణాలపై యూజర్ ఛార్జీలు ఎత్తివేయడానికి, రుణాలు రీషెడ్యూల్ చేయడానికి మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.. మార్క్ ఫెడ్ కు 1000 కోట్ల అదనపు రుణాన్ని పొందేందుకు ఆమోదం లభించింది.. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులకు రీడెండరింగ్ కు కేబినెట్ ఆమోదించింది.. హంద్రీనీవా కింద పుంగనూరు బ్రాంచి కెనాల్ కు పాత రేట్ల ప్రకారమే చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో NTPC జాయింట్ వెంచర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.. 1.06 లక్షల ఉపాధి అవకాశాలు ఈ జాయింట్ వెంచర్ ద్వారా వస్తాయన్నారు..