AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం.. 30కి పైగా అంశాల ఎజెండాతో భేటీ..

  • నేడు ఏపీ కేబినెట్ సమావేశం..
  • పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం..
  • అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ ..
  • తిరుపతి లడ్డు, సిట్ నివేదికపై చర్చ..
  • తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించే అవకాశం..
Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: ఇవాళ ఏపీ కేబినెట్‌ భేటీ కానుంది. ఉదయం 10.30 గంటలకు అమరావతి సచివాలయం ఫస్ట్ బ్లాక్‌లో మంత్రులు భేటీ కానున్నారు. నేటి సమావేశంలో లడ్డూ రాజకీయం, వైసీపీ నేతల దాడులు-అరెస్టుల అంశంపై సమగ్ర చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మంత్రులకు.. చంద్రబాబు సూచనలు చేయనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గత కేబినెట్‌లో 30 అంశాలకు పైగా ఆమోదం తెలిపారు. మళ్లీ వారం రోజులకే కేబినెట్ పెట్టడంతో ఈసారి కూడా ఎజెండా 30కి పైగా అంశాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. పెట్టుబడులు. పరిశ్రమలు.. భూ కేటాయింపు లపై నిర్ణయం తీసుకోనున్నారు.

Read Also: MLA Arava Sridhar controversy: నేడు రైల్వే కోడూరుకు జనసేన విచారణ కమిటీ.. పవన్‌ నిర్ణయంపై ఉత్కంఠ..!

×
×
Ad

ఇక, కేబినెట్‌ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది.. తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి సీబీఐ ఇచ్చిన నివేదిక.. సిట్ నివేదిక ఈ రెండు పరిశీలించాలని ఇప్పటికే సీఎం.. చంద్రబాబు మంత్రులకు సూచించారు. అదేవిధంగా తిరుమల లడ్డు అంశానికి సంబంధించి ప్రస్తుతం వైసీపీ చేస్తున్న విమర్శలు ఇతర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు వీటి మీద కూడా ప్రధానంగా క్యాబినెట్ తర్వాత చర్చకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ నాయకులు రెచ్చగొట్టే.. వ్యాఖ్యలు చేసినా..సంయమనం పాటించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు సూచించారు.