Site icon NTV Telugu

AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ..

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Meeting: ఏపీలో ఇవాళ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. లక్షా 14 వేల 824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25 శాతం నిధులను సీఆర్డీఏకి ఇచ్చేందుకు కేబినేట్‌ ఆమోదించ‌నుంది . అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప‌లు సంస్థల‌కు భూ కేటాయింపుల‌ అంశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల డీఏకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది.

Read Also: Erra Cheera Movie: హార్ట్ పేషెంట్స్ మా సినిమానికి చూడటానికి వచ్చినప్పుడు జాగ్రత్త!

మొత్తంగా ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి అమోదం తెలపనుంది కేబినెట్.. రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు అమోదముద్ర వేయనుంది.. కేబినెట్‌లో రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించబోతోంది.. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వ‌చ్చే అవ‌కాశం ఉండగా.. అమరావతిలో రూ.212 కోట్ల తో నిర్మించ‌నున్నగవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదం లభించనుంది.. కృష్ణా నదీ ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్ భవన్ నిర్మాణం జరగనుంది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25 శాతం నిధులను సీఆర్డీఏ ఇచ్చేందుకు ఆమోదించనుంది కేబినెట్‌.. రాజధాని ప్రాంతంలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం లభించనుంది.. రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. అమరావతి క్యాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీగా సీఆర్డీఏ వ్యవహరించేలా కేబినెట్‌లో ఆమోదం తెలిపే అవ‌కాశం ఉంది..

హ్యాపీ నెస్ట్, ఏపీ ఎన్నార్టీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేసేందుకు కేబినెట్‌ ఆమోదించే అవకాశం ఉంది.. కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెల‌పనుంది కేబినెట్.. ఉద్యోగుల డీఏకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది.. ఇక, ప‌లు సంస్థల‌కు భూ కేటాయింపుల‌కు అమోదం తెలపనుంది ఏపీ కేబినెట్..

Exit mobile version