NTV Telugu Site icon

AP Cabinet: ఢిల్లీకి సీఎం.. ఏపీ కేబినెట్ భేటీ వాయిదా

Ap Cabinet Meeting

Ap Cabinet Meeting

AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎల్లుండి ఉదయం 11 గంటలకు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణం.. సీఎం చంద్రబాబు.. హస్తిన పర్యటనే.. ఎందుకంటే, ఎల్లుండి ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారాన్ని బీజేపీ పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి చంద్రబాబు కూడా హాజరుకానున్నారు. దీంతో, ఎల్లుండి జరగాల్సిన ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.

Read Also: Off The Record: కార్పొరేటర్లు జనసేనలోకి వెళ్తామంటే.. టీడీపీ నేతలు బెదిరిస్తున్నారా..?

కాగా, ఎల్లుండి రాంలీల మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.. అయితే, ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు కానున్నారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.. 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత, ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది బీజేపీ.. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది.. ఇక, రేపు భారతీయ జనతా పార్టీ శాసనసభ సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత రానుంది.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తుంది.. రామ్‌ లీలా మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించనుంది.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నాయకులు, పలువురు కేంద్ర మంత్రులు, భారత్‌లోని విదేశీ దౌత్య వేత్తలు..