ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎల్లుండి ఉదయం 11 గంటలకు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణం.. సీఎం చంద్రబాబు.. హస్తిన పర్యటనే.. ఎందుకంటే, ఎల్లుండి ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారాన్ని బీజేపీ పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు.