AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీకానుంది.. ఇక, వివిధ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 21వ తేదీన సాయంత్రం 4 గంటల వరకు పంపించాలంటూ అన్ని శాఖల కార్యదర్శలకు లేఖ రాశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్.. కాగా, 23వ తేదీన జరగనున్న కేబినెట్ సమావేశంలో కీలక చర్చలు సాగే అవకాశం ఉంది.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు.. సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కేబినెట్ సమావేశం చర్చించనుంది.. దేవదాయ శాఖకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.. ఇక, దీపావళి తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది..
Read Also: Game Changer : గేమ్ ఛేంజర్ మూవీలో సాంగ్‌కు రూ. 20 కోట్ల ఖర్చు..నెట్టింట్లో హాట్ టాపిక్
కాగా, ఈ నెల 10వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయించగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త.. వ్యాపార దిగ్గజం.. రతన్ టాటా మృతి నేపథ్యంలో.. ఆయన మృతికి సంతాపం ప్రకటించింది ఏపీ మంత్రివర్గం.. ఇక, కేబినెట్ సమావేశానికి ముందుగానే రతన్ టాటా చిత్ర పటానికి నివాళులర్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు.. అయితే, అజెండా అంశాలపై చర్చ వాయిదా వేసింది మంత్రవర్గం.. దీంతో.. ఈ నెల 23వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగనుంది.. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్‌కు సంబంధించి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ప్రతిపాదనపై.. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై.. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై.. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ విషయమై ప్రతిపాదన సహా పలు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.