AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్‌ భేటీ.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం..!

  • రేపు ఏపీ కేబినెట్ సమావేశం..
  • ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో భేటీ..
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం..
  • రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం..
Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఉద‌యం 10.30 గంటలకు సచివాలయంలో ఏపీ కేబినెట్‌ సమావేశం కానుంది.. దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెలపనుంది కేబినెట్‌.. రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పనున్న మంత్రివర్గం.. రేప‌టి కేబినెట్‌ లో మొత్తంగా రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది.. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వ‌చ్చే అవ‌కాశం ఉందని అంచనా వేస్తున్నారు.. ఇక, అమరావతిలో రూ.212 కోట్లతో నిర్మించ‌నున్న గవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదముద్ర వేయనున్నారు.. కృష్ణా నది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్ భవన్ నిర్మాణం జరగనుంది.

Read Also: Harsh Goenka: పాకిస్థాన్ అమెరికా పెంపుడు కుక్క.. హర్ష్ గోయెంకా సంచలన ట్వీట్

మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25 శాతం నిధులను సీఆర్డీఏ ఇచ్చేందుకు అమోదించనుంది ఏపీ కేబినెట్.. రాజధాని ప్రాంతంలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలపనున్నారు.. రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులకు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వనుంది.. అమరావతి క్యాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీగా సీఆర్డీఏ వ్యవహరించేలా క్యాబినెట్ లో అమోదం తెలిపే అవ‌కాశం ఉండగా.. హ్యాపీ నెస్ట్, ఏపీ ఎన్నార్టీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేసేందుకు క్యాబినెట్ అమోదించే అవకాశం ఉంది.. కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి అమోదం తెలపనుంది కేబినెట్‌.. ప‌లు సంస్థల‌కు భూ కేటాయింపుల‌కు కూడా ఈ కేబినెట్‌ సమావేశంలో ఆమోదముద్ర పడే అవకాశం ఉంది..