Site icon NTV Telugu

AP Cabinet: రప్పా.. రప్పా.. వ్యాఖ్యలపై కేబినెట్‌లో చర్చ.. వారికే డ్యామేజ్‌..!

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. మరోవైపు, రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై సైతం మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు.. ఈ మధ్య ఏపీ పాలిటిక్స్‌లో కాకరేపిన రప్పా.. రప్పా వ్యాఖ్యలు కూడా ప్రస్తావనకు రాగా.. ఇటీవల వైఎస్‌ జగన్ పర్యటన.. కాన్వాయ్ ప్రమాదంపై చర్చించారు.. అయితే, రప్పా.. రప్పా వ్యాఖ్యల విషయంలో వైసీపీకి ఇబ్బందులు వచ్చాయని మంత్రులు అభిప్రాయపడ్డారట.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదని చర్చించారట మంత్రులు.. ఇక, రప్పా.. రప్పా.. వంటి వ్యాఖ్యలను వైఎస్‌ జగన్ సమర్ధించడం.. ఆ పార్టీకే బాగా నష్టం కలిగించందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కొందరు మంత్రులు..

Read Also: YS Jagan Case: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మరో కేసు.. పిలిచినప్పుడు పీఎస్‌కు రావాలని..!

ఇక, స్వర్ణాంధ్ర పీ4పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.. జిల్లా ఇంచార్జి మంత్రులు చైర్మన్ గా జిల్లాలో.. ఎమ్మెల్యే చైర్మన్ గా నియోజకవర్గ పరిధిలో ఈ కమిటీ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.. ఈ నెలాఖరులోగా కమిటీల ఏర్పాటు.. మొదటి సమావేశం పూర్తి అయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.. మరోవైపు, రెండో విడత భూ సమీకరణపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.. 44 వేల ఎకరాల భూ సమీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది కేబినెట్‌.. ఇక, బనకచర్ల ప్రాజెక్ట్ పై ఎవరూ బహిరంగంగా మాట్లాడకూడదని మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు.. అమరావతిలో 44 వేల ఎకరాల అదనపు భూమి సేకరించేందుకు నిర్ణీత సమయం విధించే విషయంపై చర్చించారు.. SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. DRC మీటింగ్ లను, నియోజకవర్గ ప్లానింగ్ మీటింగ్స్ కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం..

Exit mobile version