AP Cabinet: ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కేబినెట్ సమావేశంలో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు మంత్రులందరం అభినందనలు తెలిపామని వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత.. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించిన పార్థసారథి.. రక్షిత మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో దాదాపు రూ.5.75 కోట్లు, కుప్పం నియోజకవర్గంలో రూ. 8.22 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.. ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకున్నాం అన్నారు.. ఖైదీలు బయటకు వచ్చి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే క్షమాభిక్ష వెనక్కు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
Read Also: CM Chandrababu: మంత్రులతో కీలక అంశాలపై చర్చ.. దూకుడు పెంచాలని సీఎం ఆదేశాలు
ఇక, 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించే ప్రతిపాదన మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లా గా మారుస్తూ తీసుకువచ్చిన జీవోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. పలు సంస్థలకు భూకేటాయింపులు, హోమ్ శాఖ కు భూ కేటాయింపులు రాయితీల కల్పన పై మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు పార్థసారథి.. పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నింబధనల సవరణలకు ఆమోదం లభించింది.. ఏపీ షాప్స్ ఆండ్ ఎస్టాబిలిష్ మెంట్ బిల్లు 2025 చట్టంలో నింబధనల సవరణలకు ఆమోదముద్ర పడిందన్నారు.. విశాఖపట్నంలో యాత్రి నివాస్ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఇచ్చిన నిధులకు సంబంధించి ర్యాటి ఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. క్వామ్ టమ్ వ్యాలీకి సంబంధించి స్కూళ్ళు దగ్గర నుంచి యూనివర్సిటీల వరకు ఇన్వాల్వ్ అయ్యేలా చూడడంతో పాటు 50 ఎకరాల కేటాయిస్తు నిర్మయం తీసుకున్నామని వెల్లడించారు.
Read Also: Bilawal Bhutto: భారత్లో ముస్లింలను రాక్షసులుగా చూపిస్తున్నారు..
యోగాంధ్ర కార్యక్రమం కోసం మాస్ ర్యాలీలు చేయాలి.. అందరూ పాల్గొనేలా చర్యలకు సంబంధించి కేబినెట్‌లో చర్చించాం.. తెలుగు సినిమా సెలెబ్రిటీలు కూడా యోగలో పాల్గొనేందుకు పర్యాటక శాఖా మంత్రి చర్యలు తీసుకుంటారని తెలిపారు మంత్రి పార్థసారథి.. మరోవైపు, ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశానికి ముగ్గురుమంత్రులు డుమ్మా కొట్టారు.. దేవాదాయశాఖా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి.. రవాణా శాఖా మంత్రి రాం ప్రసాద్ రెడ్డి.. పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదు.. దీనిపై ముందుగానే సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది..
