CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాతచంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో సమావేశమై పలు కీలక అంశాలపై వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల ముసుగులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన సీఎం, డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజల్లో ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. డీఎస్సీ అంశంపై ప్రభుత్వం అన్ని వివరాలను ఇప్పటికే ప్రజలకు స్పష్టంగా వెల్లడించిందని సీఎం చెప్పారు. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు. ఈ అంశంపై కోర్టులు కూడా వైసీపీకి చీవాట్లు పెట్టినా, దుష్ప్రచారం కొనసాగుతుండటం సరికాదన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శలపై కూడా సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పరామర్శలకు వెళ్లిన ప్రాంతాల్లో ఆస్తుల ధ్వంసం, రైతుల పంటలకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. పలువురు రైతులు తమకు నేరుగా సందేశాలు పంపి నష్టాన్ని వివరించారని పేర్కొన్నారు. దీంతో జగన్ పరామర్శలు అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. దిశా చట్టం అసలు చట్టరూపం దాల్చలేదని, అయినప్పటికీ దిశా పోలీస్ స్టేషన్లు, వాహనాల పేరుతో అప్పటి ప్రభుత్వం ప్రచారం చేసిందని సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం దిశా బిల్లును తిరిగి పంపిందని గుర్తుచేశారు.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ఇదిలా ఉండగా, రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026’, ‘పీపీపీ పాలసీ-2026’ ముసాయిదాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే దిశా బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024లను ఉపసంహరించి మరింత పటిష్ఠమైన చట్టాలను తీసుకురావాలని నిర్ణయించింది. అదనంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల (UDAలు) పునర్వ్యవస్థీకరణ, పాదచారుల భద్రత పాలసీ-2026కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో “అమరావతి ఐ” పేరుతో పర్యాటక ప్రాజెక్టును ఏర్పాటు చేయడంతో పాటు, దాని పరిసరాల్లో గ్రీనరీ పార్కుల అభివృద్ధికి అవసరమైన భూ కేటాయింపులకు కూడా అనుమతి ఇచ్చింది. రానున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు రూ.210 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పుష్కరాల నిర్వహణపై ఐదుగురు ఐఏఎస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!