Site icon NTV Telugu

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. 24 అంశాలకు ఆమోదం

Ap Cabinet Decisions

Ap Cabinet Decisions

AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 24 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్‌ తీసుకున్న ప్రధాన నిర్ణయాల విషయానికి వస్తే.. నీటిపారుదల శాఖలోని 7,189 నిర్వహణ పనులకు పరిపాలన ఆమోదం తెలిపింది.. భూముల బదిలీకి సంబంధించి చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్‌.. ఇక, గాజువాకలో వెయ్యి చదరపు గజాల వరకు ఇళ్ల క్రమబద్ధీకరణ గడువును ఆరు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఇళ్ల క్రమబద్ధీకరణ గడువును జూన్ వరకు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది..

Read Also: Medipalli Thefts: మేడిపల్లిలో వరుస చోరీలతో వణుకుతున్న జనం.. 9 ఇళ్లు.. కోటి రూపాయల దోపిడీ!

గన్నవరంలో కస్టమ్స్ శాఖ భూమికి సంబంధించి గతంలో ఇచ్చిన జీఓలో మార్పులు చేసింది కేబినెట్.. పారిశ్రామిక, ఇంధన రంగంలో నిర్ణయాల విషయానికి వస్తే.. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 45.6 ఎకరాలు బయోగ్యాస్ ప్లాంట్‌కు కేటాయింపు.. నంద్యాల జిల్లా సంజామలలో 1,500 ఎకరాలు సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం.. విశాఖ జిల్లా ఆనందపురంలో 18.57 ఎకరాల కేటాయింపుకు అనుమతి.. సాంకేతిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి.. ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ప్రారంభానికి ఆమోదం తెలిపింది.. తిరుపతిలో డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. రామాయపట్నం పోర్టు అభివృద్ధికి కంఫర్ట్ లెటర్ జారీకి అనుమతి ఇచ్చింది..

ఇతర కీలక అంశాలను పరిశీలిస్తే.. ఓటర్ల జాబితా ప్రచురణకు ఏటా నాలుగు అర్హత తేదీలు కల్పించే సవరణ బిల్లుకు ఆమోదం తెపింది కేబినెట్.. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశ్రామిక ప్రోత్సాహం దిశగా ఈ నిర్ణయాలు కీలకమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Exit mobile version