AP Assembly: ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సునీత విలియమ్స్ కు అభినందనలు.. శుభాకాంక్షలు చెప్పింది శాసనసభ… సునీత విలియన్స్ జీవితం స్ఫూర్తి దాయకం అన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. తర్వాత అసెంబ్లీ లో క్వశ్చన్ అవర్ ప్రారంభం అయింది.. సంచార పశువైద్యశాలలు… విశాఖ స్టీల్ ప్లాంట్ భూములలో. రైతులకు నష్టపరిహారం.. ఎమర్జెన్సీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యం..ఈ అంశలకు సంబంధించి చర్చ జరిగింది.. సంచార పశువైద్యశాలలకు సంబంధించి గత ప్రభుత్వంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని సభ్యులు ప్రశ్నించారు.. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు.. ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామని మంత్రి అచ్చం నాయుడు హామీ ఇచ్చారు.
Read Also: Trump World Center: భారత్‌లో మొట్టమొదటి ‘‘ట్రంప్ వరల్డ్ సెంటర్’’.. పూణేలో నిర్మాణం..
ఇక, ఆంధ్రప్రదేశ్ లో సూపర్ స్పెషాలిటి వైద్యనికి సంబంధించి చర్చ జరిగింది.. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మంచి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు మంత్రి సత్యకుమార్ ..క్యాన్సర్ కేర్ సెంటర్లు.. ట్రామా సెంటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అయినప్పటికీ కూడా మెరుగైన వైద్యంపై దృష్టి పెడతామని సత్యకుమార్ చెప్పారు.. ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు ప్రవేశపెట్టారు..ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది గతంలో ఉపాధ్యాయ బదిలీల్లో ఎలాంటి పారదర్శకత్వం ఉండేది కాదన్నారు మంత్రి లోకేష్.. బదిలీల్లో అనేక అవకతవకలు జరిగాయి అన్నారు.. ఇలాంటి వాటిని అరికట్టి బదిలీల్లో పారదర్శకత తేవడం.. విద్యావిధానం అందుబాటులో ఉండేలా చూడడం కోసం ఈ బిల్లు తీసుకొచ్చాం అన్నారు మంత్రి లోకేష్..
Read Also: Nani : ప్యారడైజ్ లో అలాంటి పాత్ర చేస్తున్న నాని
ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టారు.. ఆల్రెడీ ఇప్పటికే బడ్జెట్ కు సంబంధించి చర్చ జరిగింది కాబట్టి ఈ బిల్లు పై ప్రత్యేక చర్చ అవసరం లేదని ఆర్థిక మంత్రి ప్పయ్యవుల సభకు తెలిపారు.. దీంతో ద్రవ్య వినిమయ బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది.. ఈ బిల్లు వల్ల. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ ఒకటో తారీకు నుంచి జీతాలు, బిల్లుల చెల్లింపులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా చెల్లింపులు జరగడానికి ఆస్కారం ఉంటుంది.. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది…