Site icon NTV Telugu

Annadata Sukhibhava: గుడ్‌న్యూస్‌ చెప్పిన సర్కార్.. వారి ఖాతాల్లో జమకానున్న రూ.20 వేలు..!

Annadata Sukhibhava

Annadata Sukhibhava

Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది.. సొంతంగా భూమి ఉన్న రైతులే కాదు.. ఇతరుల పొలాలను కౌలు తీసుకుని వ్యవసాయం చేసే కౌలు రైతులకూ సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది.. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.20 వేల చొప్పున అందించాలనే నిర్ణయానికి వచ్చింది.. ఆ రూ.20 వేలను మూడు విడతల్లో రైతులను అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.. పీఎం కిసాన్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఈ మొత్తాన్ని.. ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది సర్కార్‌…

Read Also: Terrorist: పోలీసుల నుంచి తప్పించుకోబోయిన లష్కరే తోయిబా స్లీపర్ సెల్.. చివరకు ఏమైందంటే..?

ఈ పథకం కింద అటవీ భూములపై హక్కు కలిగిన (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) వారిని అర్హులుగా గుర్తించనుంది ఏపీ ప్రభుత్వం.. వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులతోపాటు తహసీల్దారు, మండల వ్యవసాయాధికారులు తమ పరిధిలోని సంబంధిత రైతుల వివరాలను పరిశీలించి, ధ్రువీకరించిన అర్హుల జాబితాలను.. ఈ నెల 20వ తేదీ వరకు అన్నదాత సుఖీభవ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయితే, భర్త, భార్య, పిల్లలతో కూడిన కుటుంబం యూనిట్‌గా ఈ పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది సర్కార్‌.. పిల్లలకు వివాహమైతే వారిని ప్రత్యేక యూనిట్‌గా పరిగణించనున్నారు.. వ్యవసాయ, ఉద్యాన, పట్టుకు సంబంధించిన పంటల సాగుదారులకూ ఈ పథకం వర్తింపజేయబోతున్నారు.. అయితే, ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి మాత్రం ఈ పథకం వర్తించబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది.. మరోవైపు, గతంలో రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించినవారు.. ఇప్పుడు నిర్వహించే వారు కూడా అర్హులు కాదు. వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ఛార్టర్డ్‌ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు, నమోదైన ఇతర వృత్తి నిపుణులు కూడా అర్హులు కాదు. గత సంవత్సరంలో పన్ను చెల్లించిన వారూ పథక ప్రయోజనాలు అందుకోలేరని ప్రభుత్వం స్పష్టం చేసింది..

Exit mobile version