CM Chandrababu: 2024-25 స్వచ్ఛ సర్వేక్షణ్ లో ఏపీ ఉత్తమ పని తీరు కనబరచడంపై పారిశుధ్య సిబ్బంది, అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024-25 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ పనితీరు కనబరిచింది.. దీనికి కారణమైన మున్సిపల్ శాఖ, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, పారిశుధ్య కార్మికులు, పౌరులకు అభినందనలు అన్నారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి ప్రతిష్టాత్మక సూపర్ స్వచ్ఛ లీగ్‌లో చేరాయి.. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ కేటగిరీ కింద మినిస్టీరియల్ అవార్డు గెలుచుకుంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Cyber Gang Arrest: ఒక్క క్లిక్‌తో అకౌంట్లో ఉన్న డబ్బంతా ఊడ్చేస్తారు..
ఇక, రాజమహేంద్రవరం రాష్ట్ర స్థాయి మినిస్టీరియల్ అవార్డు అందుకుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ అవార్డులు రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో పాటు సమిష్టి కృషితో అందుకున్నాం అని తేల్చి చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర మిషన్ సాధనకు ఈ అవార్డులు మరింత స్ఫూర్తిని ఇస్తాయని చెప్పుకొచ్చారు.
