DGP Harish Kumar Gupta: గత ఏడాదితో పోలిస్తే… ఈ ఏడాది క్రైమ్ రేట్ బాగా తగ్గింది-డీజీపీ
DGP Harish Kumar Gupta: రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే 2025లో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల జరిగిన కీలక పరిణామాలు, పోలీసింగ్‌లో సాధించిన పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. హిడ్మా ఎన్‌కౌంటర్ ఘటనను పోలీస్ శాఖ విజయం లేదా మావోయిస్టుల ఓటమిగా చూడలేమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, చట్టానికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రజలకు చెబుతున్నాం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై చర్యలు తీసుకోవడమే మా బాధ్యత అని స్పష్టం చేశారు.
Read Also: CM Revanth Reddy: సభలో నుంచి కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయారో ఆయన్నే అడగండి..
Also Read
- CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
ముఖ్యంగా సైబర్ క్రైమ్, మహిళలపై నేరాలు, మత్తు పదార్థాల రవాణా నియంత్రణ ఏపీ పోలీసులకు ప్రధాన సవాళ్లుగా మారాయని పేర్కొన్నారు డీజీపీ.. సైబర్ మోసాల్లో డబ్బు రికవరీ చేయడం చాలా కష్టమైపోతున్నదని, ఒకసారి నగదు విదేశాలకు – ముఖ్యంగా చైనా గ్యాంగ్స్ ఖాతాల్లోకి వెళ్లిన తర్వాత తిరిగి తెచ్చుకోవడం దాదాపు అసాధ్యమవుతోందని వివరించారు. అందుకే ప్రజల్లో సైబర్ అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. అంతర్రాష్ట్ర స్థాయిలో డ్రగ్స్, గంజాయి రవాణాను అరికట్టడంపై మరింత ఫోకస్ పెట్టాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా తగ్గించడంలో పురోగతి సాధించినప్పటికీ.. ఈ నెట్‌వర్క్‌లో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలకు చెందిన 343 మంది పాత్ర ఉన్నట్టు గుర్తించామని, వారిపై నిఘా కొనసాగుతోందని వెల్లడించారు. బెంగళూరు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న డ్రగ్స్ లింకులను బ్రేక్ చేసేందుకు దర్యాప్తు మరింత వేగవంతం చేసినట్టు చెప్పారు.
మహిళల భద్రత విషయంలోనూ ఏపీ పోలీసులు మంచి పురోగతి సాధించారని డీజీపీ తెలిపారు. ఆలయాల వద్ద లక్షల్లో భక్తులు వచ్చే సందర్భాల్లో అక్కడక్కడా వేధింపుల ఘటనలు నమోదవుతాయి. కానీ, వాటిని జనరలైజ్ చేసి చూడకూడదు. మహిళల రక్షణకు మేం ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తాం” అని ఆయన పేర్కొన్నారు. సెల్‌ఫోన్ల రికవరీ, నేరాల నియంత్రణ, మత్తు రవాణా నిరోధం వంటి అంశాల్లో 2025లో మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. వచ్చే పదేళ్లలో పోలీసింగ్ ఎలా ఉండాలి అన్న అంశంపై సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్టు డీజీపీ చెప్పారు. ఈ మేరకు సంక్రాంతి పండుగ తర్వాత అమరావతిలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇందులో పోలీసింగ్‌లో వచ్చిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, కీలక కేసుల ఛేదన విధానాలను అధికారులకు వివరించనున్నారు.
కేంద్ర నివేదికల్లో ఏపీ 36వ స్థానంలో ఉందన్న ప్రచారం పాత సిస్టమ్ ఆధారమైనదని, రాష్ట్రం లేఖ ద్వారా ఇప్పటికే ఆ తప్పును కేంద్రానికి తెలియజేసిందని, డేటా వ్యత్యాసాల కారణంగానే అపోహలు వచ్చాయని వివరించారు. ఇప్పుడు డ్యాష్‌బోర్డులో ఏపీ వాస్తవ స్థానం కనిపిస్తుంది అని తెలిపారు డీజీపీ.. అదేవిధంగా పేకాట క్లబ్బులు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీస్ శాఖ మరింత కఠినంగా వ్యవహరిస్తుందని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేసే స్థాయికి వెళ్తామని హెచ్చరించారు. నేరాలు తగ్గడం మా విధుల్లో పురోగతి మాత్రమే. ఇందులో విజయం – అపజయం ఉండదు. చట్టాన్ని అమలు చేయడమే మా పని” అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
-
Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
-
Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
-
Bengal Repolling: పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!