Site icon NTV Telugu

Andhra Pradesh: మందు బాబులకు గుడ్‌న్యూస్‌.. అమల్లోకి కొత్త నిబంధనలు..

Suraksha App

Suraksha App

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం వ్యవహారం కలకం సృష్టించింది.. దీంతో, మనం తాగేది అసలైనా లిక్కరేనా? నకిలీ తాగేస్తున్నామా? అనే అనుమానాలు మొదలయ్యాయి.. దీని ప్రభావం లిక్కర్‌ అమ్మకాలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి.. నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్‌శాఖ ఆదాయం తగ్గిపోయింది.. దీంతో, నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్‌.. నకిలీ మద్యం నివారణకు మరిన్ని చర్యలు చేపట్టింది.. మద్యం దుకాణాలు, బార్లలో నాణ్యమైన మద్యం అమ్మేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. నకిలీ మద్యం నివారణకు నిబంధనలు అమల్లోకి తెచ్చింది ఎక్సైజ్‌ శాఖ..

Read Also: Ilaiyaraaja : ఇళయరాజా స్టూడియోపై బాంబ్ బెదిరింపు – పోలీసులు అప్రమత్తం

ఇకపై క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ చేశాకే మద్యం అమ్మేలా నిబంధన.. పెట్టింది ఎక్సైజ్‌శాఖ.. ‘ఎక్సైజ్‌ సురక్షా యాప్‌’ ద్వారా మద్యం సీసాపై కోడ్‌ స్కాన్‌ చేయాలని నిబంధన పెట్టింది.. ప్రతి దుకాణం, బార్‌ వద్ద ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది.. విక్రయించే మద్యం నాణ్యమైనదని ధ్రువీకరించినట్లు బోర్డులు పెట్టాలని నిబంధనలు పెట్టింది.. మద్యం సీసాపై సీల్‌, క్యాప్‌, హోలోగ్రామ్‌, ప్రామాణికత తనిఖీ చేయాలని నిబంధనల్లో పేర్కొంది.. ప్రతి దుకాణం, బార్‌లో డైలీ లిక్కర్‌ వెరిఫికేషన్‌ రిజిస్టర్‌ అమలు చేయాలని ఆదేశించింది.. ఎక్సైజ్‌ సిబ్బంది రోజూ మద్యం దుకాణాల్లో ర్యాండమ్‌గా తనిఖీ చేయాలని.. తనిఖీల వివరాలు దుకాణంలోని రిజిస్టర్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది.. డిపో నుంచి మద్యం అందాక, కనీసం 5 శాతం సీసాలు స్కాన్‌ చేయాలని నిబంధన పెట్టింది.. తనిఖీల్లో నకిలీ మద్యం గుర్తిస్తే, ఎక్సైజ్‌ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది..

మరోవైపు, నకిలీ మద్యం దొరికితే.. లైసెన్స్‌ రద్దు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఎక్సైజ్‌ శాఖ.. నకిలీ మద్యంపై ఫిర్యాదులకు పర్యవేక్షణ వ్యవస్థ తేవాలని పేర్కొంది.. ఫిర్యాదులను 24 గంటల్లో విచారించి నివేదించాలని ఆదేశించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా.. మొత్తంగా, నకిలీ మద్యం వ్యవహారంతో లిక్కర్‌కు దూరమవుతున్న వారిలో నమ్మకం కలిగించేలా.. తాము తాగేది అసలైన లిక్కరే అని తెలుసుకునే విధంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది మందుబాబులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఏపీ ఎక్సైజ్‌ శాఖ..

Exit mobile version