Site icon NTV Telugu

AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. వీటికి ఆమోదం..

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Key Decisions: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న ఏపీ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. పలు భూ కేటాయింపులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది ఏపీ కేబినెట్‌.. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసీకి ఉచితంగా 615 ఎకరాల భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి భూ కేటాయింపు చేసే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.. ఇక, సత్యసాయి జిల్లా తాడిమర్రిలో ఆదాని పవర్ కు 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రోపవర్ ప్రాజెక్టుకు భూ కేటాయించింది.. కడప జిల్లాలోని కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటుకు అదానీ పవర్ కు భూ కేటాయించగా.. ఎకరా 5 లక్షల రూపాయల చొప్పున భూ కేటాయింపునకు నిర్ణయం తీసుకుంది కేబినెట్..

Read Also: AP High Court: వల్లభనేని వంశీ పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా..

ఇక, 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామక నిర్ణయానికి ర్యాటిఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రతిపాదనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఏపీలోని విద్యార్ధులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీసెంటర్ల ఏర్పాటుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకీ అనుమతి ఇచ్చింది కేబినెట్‌.. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఎండీయూ వాహనాలను రద్దు చేసి రేషన్ దుకాణాల ద్వారా బియ్యం.. ఇతర సరుకులు ఇచ్చే ప్రతిపాదనపై కేబినెట్ లో చర్చ సాగింది.. మరోవైపు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సిటీసైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయించేలా జీవోఎం చేసిన సిఫార్సుకు కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఏపీ లెదర్ ఫుట్ వేర్ పాలసీ 4.0కి.. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు సంబంధించిన పెట్టుబడులకు.. రూ.30 వేల కోట్ల వరకూ పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్‌..

Exit mobile version