Minister Narayana: అమరావతి రాజధాని నిర్మాణానికి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 40 వేల ఎకరాలు అవసరం అవుతుందని అధారిటీ సమావేశంలో నిర్ణయించాం అన్నారు మంత్రి నారాయణ. రైతుల అంగీకారాన్ని తీసుకుని ల్యాండ్ పుల్లింగ్ జరుగుతుందని తెలిపారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ఐదు వేల ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం.. 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తాయని అన్నారు. వీటితో పాటు 2500 ఎకరాలకు స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని నారాయాణ పేర్కొన్నారు.
Read Also: MLC Nagababu: 101 జనసేన కుటుంబాలకు రూ.5 కోట్ల బీమా చెక్కుల పంపిణీ
అయితే, ల్యాండ్ పుల్లింగ్ నా లేక అక్విజషన్ చేయాలా అన్నదానిపై అభిప్రాయ సేకరణ చేయమని స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పామని మంత్రి నారాయణ తెలిపారు. వీలైనంత వరకు ల్యాండ్ పుల్లింగ్ చేయాలని అనుకుంటున్నాం.. 36 వేల ఎకరాలు పుల్లింగ్ లో ఇవ్వడానికి రైతులు అంగీకరించినట్టు స్థానిక ఎమ్మెల్యేలు తెలిపారన్నారు.. GAD, HoD ఆఫీసుల 5 టవర్ల టెండర్లు ఇప్పటికే పూర్తయ్యాయని.. ML1గా వచ్చిన L&T, షాపోర్జీ అండ్ పల్లంజి గ్రూపులు వీటి నిర్మాణం చేపట్టనున్నాయన్నారు. మొత్తం 3,679 కోట్లతో 5 టవర్ల నిర్మాణానికి అధారిటీ ఆమోదించిందన్నారు మంత్రి పొంగూరు నారాయణ.
