Site icon NTV Telugu

Amaravati Iconic Bridge: అమరావతి ఐకానిక్ వంతెన నమూనా ఎంపిక..

Amaravati

Amaravati

Amaravati Iconic Bridge: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఐకానిక్ వంతెన నమూనా ఫైనల్ అయింది. ఈ వంతెన నిర్మాణం పూర్తైతే హైదరాబాద్ – అమరావతి మధ్య దూరం సుమారు 35 కిలో మీటర్ల తగ్గనుంది. ఇక, అమరావతిని అనుసంధానించే దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ఇటీవల నాలుగు నమూనాలను సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ఉంచి ప్రజల అభిప్రాయ తీసుకున్నారు. అందులో రెండో ఆప్షన్‌కు దాదాపుగా 14 వేల ఓట్లు రావడంతో అదే నమూనా ఎంపికైంది.

Read Also: Uttar Pradesh: అన్నయ్య మరణం తట్టుకోలేక.. చెల్లి ఏం చేసిందంటే…

అయితే, ఇప్పటికే ఈ నమూనాకు సంబంధించిన డీపీఆర్ సిద్ధమైంది. అమరావతిలోని ఎన్–19 రోడ్డును ఎన్‌హెచ్–65 (విజయవాడ–హైదరాబాద్ రహదారి)తో అనుసంధానం చేసేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. రూ.2,500 కోట్ల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లను ఏపీ ప్రభుత్వం పిలవనుంది. కాగా, ఎరుపు, తెలుపు రంగుల్లో జంట పైలాన్లతో రూపుదిద్దుకునే ఈ ఐకాన్ వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు 5.22 కిలో మీటర్ల పొడవున కేబుల్ బ్రిడ్జ్ ను నిర్మించనున్నారు.

Read Also: TheyCallHimOG Bookings : ‘OG’ నైజాం బుకింగ్స్ ఓపెన్ చేసేందుకు డేట్ ఫిక్స్..

ఇక, ప్రస్తుతం ఎన్‌హెచ్–65 నుంచి అమరావతికి చేరుకోవాలంటే మూలపాడు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, కనకదుర్గ వంతెన, ప్రకాశం బ్యారేజ్ మీదుగా 40 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఐకానిక్ వంతెన పూర్తైతే మూలపాడు నుంచి కేవలం 5 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తే అమరావతిలోకి నేరుగా ప్రవేశం లభిస్తుంది. ఈ వంతెన నిర్మాణంతో సుమారు 35 కిలో మీటర్ల దూరం తగ్గి, గంటన్నర సమయం ఆదా కానుందని అధికారులు తెలిపారు.

Exit mobile version