Amaravati Capital: ఏపీ రాజధాని అమరావతి.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే. ఇక ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఫ్యూచర్లోనూ అమరావతే రాజధానిగా కొనసాగుతుంది. ఈ మేరకు చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లుకు ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ వాకౌట్ చేసినప్పటికీ.. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతకుముందు కేంద్ర కేబినెట్ బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న రాజధాని సందిగ్ధతకు ముగింపు పలికేలా, అమరావతికి రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.
Read Also: Naga Shaurya : శ్రీదేవి నా లక్కీ చార్మ్ కావాలి అని కోరుకుంటుంన్నా..
Also Read
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించడం ద్వారా అమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా ఖరారు చేస్తూ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు ద్వారా APCRDA పరిధిలోని ప్రాంతమంతా అమరావతిగా గుర్తించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ మార్చి 28న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. 2014 విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఉంటుందని చెప్పారు. అమరావతి అనే పేరును స్పష్టంగా పొందుపరచలేదు. గత ప్రభుత్వ హయాంలో తలెత్తిన 3 రాజధానుల గందరగోళం భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే, విభజన చట్టంలోనే అమరావతి పేరు ఉండాలని ప్రస్తుత ప్రభుత్వం భావించింది. ఇందుకోసం సెక్షన్ 5(2) కు సవరణ కోరుతూ తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర హోం శాఖకు పంపిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీని ద్వారా ఏపీ రాజధానిగా అమరావతి హోదాపై ఉన్న న్యాయపరమైన, సాంకేతిక పరమైన చిక్కులు తొలగిపోయి, కేంద్రం నుంచి అందే నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు మార్గం సుగమం కానుంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత… పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆ గడువు 2024 జూన్ 2తో ముగుస్తుంది. అదే రోజు నుంచి అమరావతి రాజధానిగా ఉంటుందని బిల్లులో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీకి ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు