Amaravati Capital Farmers: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంత రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు రాజధాని ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపు జరగనుంది. గతంలో మాదిరిగానే ఇ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపునకు సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయించనున్నారు.
Read Also: UAE: నేడు యూఏఈలో రష్యా-అమెరికా-ఉక్రెయిన్ కీలక భేటీ.. చర్చలపై సర్వత్రా ఉత్కంఠ
గ్రామాల వారీగా ప్లాట్ల కేటాయింపు ఇలా జరగనుంది..
* నిడమర్రు – 58
* పిచ్చుకలపాలెం – 3
* అనంతవరం – 1
* పెనుమాక – 7
* లింగాయపాలెం – 7
* వెలగపూడి – 25
* మందడం – 21
* మల్కాపురం – 10
* కురగల్లు – 7
* నేలపాడు – 2
మొత్తంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఇ-లాటరీ నిర్వహించనున్నారు. అదేవిధంగా ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన 201 మంది రైతులకు మొత్తం 390 ప్లాట్లు కేటాయించనున్నారు. ఉండవల్లి రైతుల కోసం మధ్యాహ్నం 3 గంటలకు ఇ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరగనుంది.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించిన విషయం విధితమే.. ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు.. భవిష్యత్తు అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం భూ సేకరణ కూడా చేస్తున్న విషయం విదితమే..