NTV Telugu Site icon

AP DSC, TET 2024: టెట్, డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ప్రిపరేషన్ కు సమయం

Tet, Dsc

Tet, Dsc

ఏపీలో టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఈ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలను ప్రకటించనుంది. మంత్రి నారా లోకేష్‌ను కలిసి టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరారు. ఈ క్రమంలో.. టెట్‌, మెగా డీఎస్సీ సన్నద్ధతకు సమయమిచ్చే అంశంపై విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్‌ సమీక్ష నిర్వహించారు. అభ్యర్థుల వినతిని పరిగణనలోకి తీసుకున్న మంత్రి లోకేష్‌.. టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read Also: Bihar: బీహార్‌లో కూలిన మరో బ్రిడ్జి.. 15 రోజుల్లో 7కి చేరిన సంఖ్య

టెట్ పరీక్ష నిర్వహణకు 90 రోజులు, మెగా డీఎస్సీ నిర్వహణ కు 90 రోజుల సమయమివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే టెట్, డీఎస్సీ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం కొత్త తేదీలను ప్రకటించనుంది. ఎన్నికల్లో హామీ మేరకు ఈ మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న వారికీ మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించేలా టెట్ నోటిఫికేషన్ వెలువడైంది.

Read Also: CM Chandrababu: రాజధాని పునర్‌ నిర్మాణం చేసి తీరాల్సిందే.. చంద్రబాబు భావోద్వేగం