NTV Telugu Site icon

CM Chandrababu: అభిమాన నేతకు పేద విద్యార్ధిని తీపి జ్ఞాపిక.. ఆనందంతో పొంగిపోయిన సీఎం

Cm

Cm

కొందరు నాయకులను ఆదర్శంగా తీసుకుని తమ అభిమానాన్ని చాటుతుంటారు జనాలు. తమకు నచ్చిన స్టార్ హీరోలు, క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు ఇలా వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తుంటారు. మనం వార్తల్లో చూస్తూనే ఉంటారు.. కొందరు హీరోల కోసం, క్రికెటర్ల కోసం అభిమానులు ఎక్కడి నుండో వచ్చి వారి అభిమానాన్ని చాటుతారు. ఇలా రాజకీయ నాయకులపై కూడా అభిమానం చాటే వ్యక్తులు కూడా ఉంటారు. తాజాగా.. ఓ విద్యార్థిని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన అభిమానాన్ని చాటింది.

Read Also: Nadendla Manohar: రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాను అభివృద్ధి బాటలో నిలబెడతాం..

తన అభిమాన నాయకుడిని నేరుగా కలిసి తీపి జ్ఞాపికను అందించింది ఓ విద్యార్ధిని. విజయవాడ పడమట విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్ధిని లాస్యకు చంద్రబాబు అంటే అంతులేని అభిమానం. తన స్వహస్తాలతో గీసిన చంద్రబాబు రేఖాచిత్రాన్ని తీసుకొని సోమవారం సచివాలయానికి వచ్చింది. తాను గీసిన చిత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేయడంతో ఆయన ఆనందంతో మురిసిపోయారు. ‘‘సంపద సృష్టించి పేదవారికి పంచి ఇచ్చే పెన్నిధికి ఒక పేద విద్యార్ధి ఇచ్చే చిరుజ్ఞాపిక’ అంటూ చిత్రంపై రాసింది. ఇది చూసి ముగ్దుడైన చంద్రబాబు లాస్యను అభినందించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు.

Read Also: Chiranjeevi: ANR జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి

Show comments