Cyclone Montha: మొంథా తుఫాన్ విధ్వంసం సృష్టించింది.. భారీ నష్టాన్ని మిగిల్చింది.. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. తుఫాన్ అనంతర పరిస్థితులపై ఇరిగేషన్ అడ్వైజర్, ఈఎన్సీ, సీఈలు, ఎస్ఈ లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాం మంత్రి నిమ్మల రామానాయుడు.. ఆత్మకూరు, డోర్నాలా ప్రాంతంలో భారీ వర్షాలతో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ కు గండి పడి నీరు చేరినట్టు తెలిపారు.. వెలిగొండ టన్నెల్ ఎగ్జిట్ ప్రాంతానికి నీరు రావడంతో 2 టన్నెల్స్ లోకి 9 కిలో మీటర్ల మేర లోనికి నీరు ప్రవేశించిందని తెలిపారు.. టన్నెల్ లో 250 మంది కార్మికులు పనిచేస్తుండగా.. వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించామని వెల్లడించారు.. ఇక, టన్నెల్ లో డీ వాటరింగ్ పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు మంత్రి నిమ్మల..
Read Also: Cyclone Montha: మరో 48 గంటలు జాగ్రత్త.. జిల్లా కలెక్టర్లకు మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు
ఇక, గుండ్లకమ్మ పరివాహక ప్రాంత అధిక వర్షాలతో ఔట్‌ఫ్లోను 70 వేల క్యూసెక్కుల నుండి లక్ష క్యూసెక్కులకు విడుదల చేస్తూ వాటర్ మేనేజ్‌మెంట్ చేయడం జరుగుతోందన్నారు మంత్రి తుమ్మల.. గుండ్లకమ్మ వరద నేపథ్యంలో ప్రకాశం, బాపట్ల కలెక్టర్లు దిగువ గ్రామాలలో అవసరమైన జాగ్రత చర్యలు తీసుకోవాలని సూచించాం. ఒడిశా రాష్ట్రంలోని వరదలను దృష్టిలో ఉంచుకొని ఉత్తరాంధ్రలోని బహుదా పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.. చెరువులు, కాలువలకు గండ్లు పడిన చోట కలెక్టర్లతో మాట్లాడి టీఆర్-27 కింద అత్యవసర అనుమతులు తీసుకుని వెంటనే మరమత్తులు పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.. రాబోయే రెండు, మూడు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు..
