Site icon NTV Telugu

Collectors Conference: 6 నెలల్లో ప్రజల నుంచి 1,29,963 ఫిర్యాదులు.. రెవెన్యూ విభాగంలోనే ఎక్కువ..

Collectors Conference

Collectors Conference

Collectors Conference: గడచిన ఆరు నెలలుగా ప్రజల నుంచి 1,29,963 ఫిర్యాదులు ప్రభుత్వానికి వచ్చినట్టు తెలిపారు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్‌ కుమార్.. భోజన విరామం తర్వాత రాష్ట్రంలో ఫిర్యాదుల స్వీకరణపై కలెక్టర్ల సదస్సులో సమీక్ష నిర్వహించారు.. గ్రీవెన్స్ పరిష్కారంపై ప్రజెంటేషన్ ఇచ్చారు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్‌ కుమార్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఫిర్యాదులు అన్నింటినీ ఒక్కచోట నమోదు చేస్తున్నాం.. ఇప్పటి వరకు 1,29,963 ఫిర్యాదులు వచ్చాయి.. అందులో 78,700 ఫిర్యాదులు రెవెన్యూ విభాగం నుంచి వచ్చినవే ఉన్నాయి.. 14,119 ఫిర్యాదులు పోలీసు విభాగానికి చెందినవి.. 13,146 మున్సిపల్ శాఖకు సంబంధించినవి అని వివరించారు.. అయితే, అన్ని విభాగాలు 70 శాతం మేర ఫిర్యాదులు పరిష్కరించినట్టు వెల్లడించారు..

Read Also: Jayathi : మ్యూజిక్ ఆల్బమ్ తో హల్ చల్ చేస్తున్నవెన్నెల జయతి

అయితే ప్రజల నుంచి సంతృప్తి స్థాయి ప్రతీ నెలా తగ్గుతూ వస్తోందన్నారు సురేష్‌ కుమార్.. దీంతో, ప్రజలకు సరైన పరిష్కారం చూపించటం లేదని అర్ధం అవుతోందన్న ఆయన.. వారిలో అసంతృప్తి ఎక్కువ అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది.. కొన్ని ఫిర్యాదులు పరిష్కరించలేనివి కూడా వస్తున్నాయి.. ప్రజలకు సమాధానం చెప్పేటప్పుడు నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు అని సూచించారు.. చాలా సమస్యల్ని మానవత్వంతో పరిష్కరించాలని అందరికీ సూచిస్తున్నాను.. ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత ఉండాలి అదే ప్రామాణికంగా పనిచేయాలన్నారు.. ఆర్ధిక, ఆర్థికేతర అంశాలుగా వాటిని వేరు చేసి వీలైనంతమేర పరిష్కరించాలి.. అటవీ భూములకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వ విభాగాలు కూర్చుని చర్చించి పరిష్కారం చూపించాలని కోరారు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్‌ కుమార్..

Exit mobile version