అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ఆవిష్కరించిన కాంస్య విగ్రహానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ విగ్రహాన్ని రూ.3 కోట్ల వ్యయంతో 15 టన్నుల బరువుతో, 30 అడుగుల పొడవుతో నిర్మించారు. ఈ విగ్రహంలో 10 టన్నుల కాంస్యం, 7 టన్నుల స్టీలును వినియోగించారు. దేశంలోని అతిపెద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహంగా ఇది రికార్డులకెక్కింది. ఈ విగ్రహాన్ని బుర్రా ప్రసాద్ అనే శిల్పి 30 రోజుల్లో తయారు చేశారు.
Read Also: PM Modi : తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా.. అంటూ
పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు అనే దాత సహకారంతో అల్లూరి విగ్రహాన్ని తయారు చేయించారు. అల్లూరి విగ్రహానికి అవసరమైన రూ.3 కోట్ల వ్యయాన్ని ఈ దాతే అందించారు. కాగా క్షత్రియుల జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అయితే మన్యం వీరుడు అల్లూరి విగ్రహం ఉంటే బాగుంటుందని అందరూ భావించారు. దీంతో పాటు విప్లవకారుడు పుట్టిన ప్రాంతం కూడా ఇక్కడే ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భీమవరం వేదికైంది.