Site icon NTV Telugu

Electric Shock: బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్‌తో కుమారుడు.. కాపాడబోయి తల్లి, కూతురు మృతి

Electric Shock

Electric Shock

Electric Shock: బట్టలు ఆరేస్తుండగా జరిగిన ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.. ఒకేసారి ఏకంగా ముగ్గురు మృతి చెందారు.. తల్లి, ఇద్దరు పిల్లలు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెదబయలు మండలం కిముడుపల్లెలో విద్యుత్ షాక్ తో తల్లి, కుమారుడు, కుమార్తె.. ఇలా ముగ్గురు ఒకేసారి ప్రాణాలు విడిచారు.. కుమారుడు సంతోష్(13) తీగపై బట్టల ఆరబెడుతుండగా కరెంట్ షాక్‌ తగిలింది.. అయితే, ఊహించని పరిణామంతో తన కుమారుడిని రక్షించేందుకు ప్రయత్నించింది తల్లి.. కానీ, తల్లి కోర్ర లక్ష్మి (36) కూడా విద్యుత్‌ షాక్‌కు గురైంది.. ఆ తర్వాత కుమార్తె అంజలి(10) రావడంతో.. ఆ చిన్నారిని కూడా ప్రాణాలు విడిచింది.. ఇలా ఒకేసారి తల్లి, కుమారుడు, కుమార్తె.. విద్యుదాఘాతంలో ప్రాణాలు విడిచిన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, మృతురాలికి మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.. ఆ చిన్నారులను పట్టుకుని.. వాళ్ల నాన్నమ్మ కన్నీరు పెట్టడం అందరి హృదయాలను కదలించివేసింది..

Read Also: WTC 2025 Final: టీమిండియాకు బిగ్ షాక్.. అగ్రస్థానానికి దక్షిణాఫ్రికా జట్టు

Exit mobile version