Site icon NTV Telugu

Chhattisgarh: ఛత్తీస్గఢ్కి హిడ్మా మృతదేహం తరలింపు..

Hidma

Hidma

Chhattisgarh: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మడావి హిడ్మా మృతదేహం ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి తరలించారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో గత రాత్రి హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. పోస్టుమార్టం అనంతరం హిడ్మా, అతని భార్య రాజక్క మృతదేహాలు బంధువులకు అప్పగించారు. హిడ్మా స్వగ్రామం ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే, హిడ్మా పోస్టుమార్టంలో ఆయన సోదరుడితో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Read Also: The Raja Saab: సిద్ధమవుతున్న ‘రాజాసాబ్’.. ఓవర్సీస్‌లోనే ముందే సంచలన బుకింగ్స్!

అయితే, మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, పీఎల్డీఏ ఒకటో బెటాలియన్ కమాండెంట్ మడావి హిడ్మా ఈనెల 18న మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. అలాగే, ఈనెల 18, 19 తేదీల్లో మారేడుమిల్లి దగ్గర రెండు వరస ఎన్ కౌంటర్లలో మరో 13 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇంత వరకు ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేయగా.. మిగిలిన ఏడు మావోయిస్టులు మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతుంది. పోస్టుమార్టం నిర్వహిస్తున్న రంపచోడవరం ఏరియా హాస్పిటల్ మార్చురీ దగ్గర భారీగా భద్రత దళాలతో భద్రతను ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం పూర్తైన మావోయిస్టుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తున్నారు పోలీసులు.

Exit mobile version