Site icon NTV Telugu

AP Tourists: పండుగ పూట.. ఏజెన్సీకి పర్యాటకుల తాకిడి..

Tourists

Tourists

AP Tourists: పండుగ పూట ఏజెన్సీకి పర్యాటకుల తాకిడి పెరిగిపోయింది.. అల్లూరి జిల్లా రంపచోడవరంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యాటకుల సందడి మొదలైంది.. సంక్రాంతి పండగకి గోదావరి జిల్లాకు వచ్చిన వారంతా ఏజెన్సీ ప్రాంతాలైన రంపచోడవరం, మారెడిమిల్లి వైపునకు క్యూ కట్టారు.. దీంతో.. చింతూరు, వీఆర్‌ పురం, మారేడుమిల్లి ప్రాంతాల్లో సందడిగా మారింది.. మరోవైపు.. మన్యంలోని రిసార్ట్‌లకు పుల్‌ గిరాకీ పెరిగిపోయింది.. పర్యాటకులతో రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు రచ్చగా మారాయి..

Read Also: Maha kumbh mela: పాకిస్తాన్‌తో సహా ముస్లిం దేశాల్లో ‘‘మహా కుంభమేళ’’ ట్రెండింగ్..

రంపచోడవరం పరిధిలోని చింతూరు, వీఆర్‌ పురం, మారేడుమిల్లి మన్యం మండలాలు గోదావరి జిల్లాకు సంక్రాంతికి వచ్చిన వారికి వేదికగా మారాయి. చింతూరు మండలంలోని మోతూగూడెం పంచాయతీ పరిధిలోని పోల్లూరు జలపాతం పర్యాటకులను అలరిస్తోంది.. జలపాతాన్ని చూసేందకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి జనం బారులు తీరారు. సంక్రాంతి పండుగను అంబరంగా జరుపుకుంటూనే.. విహారయాత్రలోనూ ఎంజాయ్‌ చేస్తున్నారు.. పర్యాటకుల రాకతో ఏజెన్సీ సందడిగా మారిపోయింది.. ఓవైపు వరుస సెలవులు.. మరోవైపు.. పండగకి సొంత ఊరికి వచ్చినవాళ్లు.. పనిలోపనిగా.. ఏజెన్సీని చుట్టేస్తున్నారు..

Exit mobile version