Alla Nani Counter To Pawan Kalyan Comments: ఏలూరు బహిరంగ సభలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. అంబేద్కర్ సాక్షిగా.. జగన్‌పై వారాహి యాత్రలో పవన్ దుష్ర్పచారం చేశారని విమర్శించారు. జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకనే.. చంద్రబాబు మార్గదర్శంలో పవన్ విషం చిమ్మారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిపై, సమస్యలపై పవన్‌కు కనీస అవగాహన లేదన్నారు. ఏలూరు నియోజకవర్గ జనసేన సభకు జిల్లా నలుమూలల నుండి జనాన్ని తరలించారన్నారు. ఏలూరులో సమస్యలపై తమ్మిలేరు రక్షణ గోడను రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించామన్నారు. దశాబ్దన్నర కాలం పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఏనాడూ తమ్మిలేరు ముంపుపై స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kaavaalaa Song: ‘కావాలా’ పాటలో తమన్నా అద్భుతమైన డ్యాన్స్.. ప్రియుడు విజయ్ వర్మ ప్రశంసల వర్షం
ఏలూరు ఆసుపత్రికి జీవం పోసి, మెడికల్ కాలేజీ తీసుకొచ్చామని ఆళ్ల నాని తెలిపారు. వైసీపీ పాలనలో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మిస్తుంటే.. దానిపై అసత్య ప్రచారం చేయడం తగదని అన్నారు. కుట్రపూరితంగా అసత్యాలు చెప్పి, ఏలూరు ప్రజలను పవన్ మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. శ్మశానంలో ఏసీ రూమ్‌లు, ఏసీ గదులు పెట్టారన్న ఫిర్యాదులపైనా చర్యలు తీసుకున్నామన్నారు. ఏలూరు అభివృద్ధిపై పవన్ ఎప్పుడు బహిరంగ చర్చకు రమ్మన్నా.. తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. వాలంటీర్లు ఎంతో కష్టపడి రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తుంటే.. వారిపై ఆరోపణలు చేయడం ఏమాత్రం సబబు కాదన్నారు. సీఎం జగన్‌పై వ్యక్తిగత చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌నే పవన్ ఏలూరులో చదివారని దుయ్యబట్టారు.
అటు.. వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. వాలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 29 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నాడన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు చూస్తే.. మద్యం, గంజాయి మత్తులో మాట్లాడినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ బేషరతుగా వాలంటీర్ వ్యవస్థకు, రాష్ట్ర మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.