NTV Telugu Site icon

YSRCP Plenary 2022: ప్లీనరీకి చకచకా ఏర్పాట్లు.. వేదిక రెడీ

Ysrcp1

Ysrcp1

ఏపీలో పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న వైసీపీ పండుగ ప్లీనరీకి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్ల గురించి మంత్రి అమర్నాథ్ మాట్లాడారు. వేదికపై 280 మందికి సీటింగ్ ఉంటుందనీ, మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లు, సీనియర్ నేతలు మొదటి వరుసలో ఉంటారు.నాలుగు క్యాటగిరీల్లో పాసులు జారీ చేస్తున్నాం. డయాస్ పాస్, వీవీఐపీ పాస్, వీఐపీ పాస్, డిగ్నటరీస్ పాస్. వేదికపై ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్పీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉంటారన్నారు.

వేదిక కింద మొదటి వరుసలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్పీలు, వైస్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు ఆసీనులవుతారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. మొదటి రోజు లక్ష మందికి భోజనాలు సిద్ధం చేస్తున్నాం. రెండో రోజు మూడు నుంచి నాలుగు లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. ప్లీనరీ ఏర్పాట్ల పై కసరత్తు కొనసాగుతోందన్నారు. నేతల వరుస సమావేశాలతో వాతావరణం వేడెక్కింది. ప్లీనరీకి సంబంధించి ఏం చేయాలనేదానిపై సమావేశం అయ్యారు మంత్రులు పెద్దిరెడ్డి, మేరుగ నాగార్జున, నారాయణ స్వామి, గుడివాడ అమర్నాథ్, విశ్వరూప్, ధర్మాన ప్రసాదరావు, కార్మూరి, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు. ప్లీనరీ ప్రాంగణాన్ని, గ్రౌండ్ ను పరిశీలించారు మంత్రులు.

రాబోయే ఏడాది ప్రభుత్వ పరంగా, అటు పార్టీ పరంగా ఏం చేయాలనదానిపై కసరత్తు ముమ్మరం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ అమలుచేశామని, ఇవ్వని హామీలు కూడా అమలుచేస్తున్నామని మంత్రులు అంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు. ప్లీనరీ రెండవ రోజు భారీగా జనం వస్తారని భావిస్తున్న వైసీపీ నేతలు అందుకు తగినవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

YCP : దర్శి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య బుసలు కొడుతున్న వివాదం