Site icon NTV Telugu

All Party Meeting: ముగిసిన అఖిలపక్ష సమావేశం.. తీర్మానాలు ఇవే..

All Party Meeting

All Party Meeting

అఖిలపక్ష సమావేశం ముగిసింది.. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటూ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.. వివిధ తీర్మానాలు చేసింది అఖిలపక్ష సమావేశం. జగన్ ప్రభుత్వ హింసాత్మక చర్యలపై సీజేఐను కలిసి వినతిపత్రం ఇవ్వాలని, రాష్ట్రస్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు చేయాలని, జిల్లా, మండల స్థాయిలో పరిరక్షణ వేదిక కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వ అణిచివేతకు గురైన వారికి వేదిక అండగా ఉండాలని, ప్రభుత్వ విధానాలపై పరిరక్ష వేదిక పనిచేయాలని తీర్మానించారు. ఇక, వైఎస్‌ జగన్ హయాంలో బడుగులు, పార్టీలపై జరిగిన దాడులను పరిరక్షణ వేదిక ఖండించింది.. ఈ అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్టీలతో సంబంధం లేకుండా అంతా ఏకం కావాలని, పార్టీలు, అభిప్రాయాలు వేరైనా రాష్ట్ర భవిష్యత్ కోసం కలిసి పోరాడుదామని పిలుపిచ్చారు.

Read Also: Brain Eating Amoeba: మెదడును తినే వ్యాధి.. ఆ దేశంలో తొలి మరణం నమోదు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి త్వరలోనే విజయవాడ రానున్న నేపథ్యంలో.. అంతా కలిసి రాష్ట్ర పరిస్థితుల్ని ఆయనకు నివేదించాలని నిర్ణయంచారు.. వైసీపీ అధికారంలోకి రాగానే జగన్‌రెడ్డి విధ్వంసంతో పాలన ప్రారంభించారని ఆరోపించారు. ప్రశ్నిస్తే హింసించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, దుర్మార్గుడైన ఫ్యాక్షనిస్టును నమ్మి ప్రజలు మోసపోయారని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అన్ని పార్టీలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్న అచ్చెన్నాయుడు.. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే మళ్లీ ఇలా కూర్చొని మాట్లాడలేని పరిస్థితి ఉండదన్నారు.. ఇళ్లల్లో ఉన్నవారి పైనా దాడులు చేస్తారని ఆరోపించారు.. ఇక, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక పని చేయాలన్నారు.. పార్టీలు ఈ పరిరక్షణ వేదికకు రాజకీయ పార్టీలు వెనుకుండాలని.. పరిరక్షణ వేదికలో రాజకీయ పార్టీల పరిమితంగా ఉంటేనే ఉద్యమం బలపడుతుందని సూచించారు వి. శ్రీనివాసరావు.

Exit mobile version