NTV Telugu Site icon

Konaseema: అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు బంద్‌..

Internet

Internet

అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు బంద్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు పోలీసులు.. అన్ని నెట్వర్క్ లకు సంబంధించిన ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.. కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారం చిచ్చుపెట్టిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉన్నా.. మళ్లీ చలో రావులపాలెం పిలుపుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.. నిన్న జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకుని.. పరిస్థితులు చక్కబడే వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని అన్ని నెట్‌వర్క్‌లను ఆదేశించారు పోలీసు అధికారులు.. ఇక, వివిధ ప్రాంతాల నుంచి అమలాపురానికి వచ్చే ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు.. కాకినాడ, రాజమండ్రి నుంచి కోనసీమకు బస్ సర్వీసులు రద్దు చేసింది ఏపీఎస్‌ ఆర్టీసీ.

Read Also: Audimulapu Suresh: అంబేద్కర్ అందరివాడు.. ఇది చాలా బాధాకరం..!

ఇక, కోనసీమ జిల్లాలో పోలీసుల భారీ బందోబస్తు కొనసాగుతోంది.. అమలాపురం అయితే అష్టదిగ్భందంలోకి వెళ్లిపోయింది.. పోలీస్ పికెట్లు, భారీ గస్తీ ఏర్పాటు చేశారు.. అక్కడే మకాం వేసి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఏలూరు డీఐజీ పాలరాజు.. ఇవాళ రెండు వర్గాలు ఆందోళనలకు పిలుపునివ్వడంతో.. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా.. పోలీసులు అప్రమత్తం అయ్యారు. బయటవారు అమలాపురంలోకి రాకుండా ఆంక్షలు విధించారు. అనుమానితులు ఎవరు పట్టణం వైపు రాకుండా నిఘా పెట్టారు పోలీసులు.. అమలాపురం డిపో నుంచి సర్వీసులు తాత్కాలికంగా రద్దు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులను ప్రయాణీకులు లేకుండానే తిప్పి పంపిస్తున్నారు పోలీసులు.. బస్సుల రద్దు సమాచారం తెలియక డిపోలో పడిగాపులు పడుతున్నారు ప్రయాణికులు, అమలాపురంలో సెక్షన్ 144 కొనసాగుతోంది.. పోలీసుల వలయంలోకి అమలాపురం వెళ్లిపోయింది.. అడుగడుగునా పోలీసులు మోహరించారు. ఇవాళ ఛలో రావులపాలెంకు కోనసీమ జిల్లా సాధన సమితి పిలుపునివ్వగా.. భారీగా మోహరించారు పోలీసులు.

Show comments