గత కొంతకాలంగా సైలెంట్ గా వున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ స్పీడ్ పెంచారు. నంద్యాల జిల్లా చాగలమర్రిలో అక్రమ కూల్చివేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అఖిలప్రియ. ఇంటిస్థలంపై కోర్టులో కేసు నడుస్తుండగానే పోలీసుల్ని, అధికారుల్ని ముందుపెట్టుకొని ఇంటిని కూల్చారంటూ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీమంత్రి అఖిల ప్రియ. టీడీపీ ప్రభుత్వం రాగానే మీ కంటే రెండింతలు ఎక్కువ చేస్తాం అంటూ వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు అఖిలప్రియ.
వైసీపీ నాయకులకు ఓర్పు లేక, తీవ్రమైన ప్రస్టేషన్ కు గురవుతున్నారన్నారు. వైసీపీ నుండి టీడీపీకి వచ్చిన కార్యకర్తలపై కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులకు భయపడేది లేదన్నారు అఖిల ప్రియ. చాగలమర్రిలో టీడీపీలోకి చేరిన వ్యక్తి ఇంటికి ఎటువంటి నోటీసులు లేకుండా పోలీసులను అధికారులను అడ్డంపెట్టుకుని జేసీబీలతో కూల్చివేశారు. వైసీపీ ప్రభుత్వం మహిళలకు న్యాయం చేస్తున్నామంటూనే టీడీపీకి చెందిన ఓ మహిళ పేరు మీద ఉన్న ఇంటిని వైసీపీ నాయకులు జేసీబీలతో కూల్చి ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను ఊర్లో లేను ఈ సమయం చూసి జేసీబీలతో టీడీపీ కార్యకర్త ఇంటిని కూల్చి అరాచకం చేసిన వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. మా కార్యకర్తల ఒక్క ఇల్లు కూల్చి వేస్తే మా ప్రభుత్వం వచ్చాక 10 ఇళ్లు కూల్చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నుండి టీడీపీలోకి వస్తున్న జనాలను చూసి ఏపీ సీఎం జగన్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మీటింగ్ పెట్టి గాడిదలు కాస్తున్నావా అంటూ వార్నింగ్ ఇస్తున్నారన్నారు అఖిల ప్రియ. వైసీపీ నాయకులు చేసే అరాచకాలు అక్రమాలకు గ్రామస్తులు బుద్ధి చెప్తారన్నారు.
Viral Video: చంద్రుడిపై జారిపడ్డ వ్యోమగామి.. మైకేల్ జాక్సన్‌లా మూన్‌వాక్ అంటూ..