NTV Telugu Site icon

Agnipath Scheme: ఏపీలోని 13 జిల్లాల నిరుద్యోగులకు గమనిక.. విశాఖలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

Agniveer

Agniveer

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంకు సంబంధించి అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీని విశాఖలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్టు 14 నుంచి 31 వరకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అగ్నివీరుల ఎంపికలు ఉంటాయని ప్రకటించారు. ఏపీలోని 13 జిల్లాలు, యానాం కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన అభ్యర్థులు ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, యానాం ప్రాంతం వారు ఈ రిక్రూట్ మెంట్‌లో పాల్గొనవచ్చని సూచించారు.

Read Also: Nagpur: ప్రియురాలితో శృంగారం చేస్తూ చనిపోయిన 28 ఏళ్ల యువకుడు

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 30 వ తేదీలోగా రిక్రూట్ మెంట్ ర్యాలీ రిజిస్ట్రేన్ ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 7వ తేదీ నుంచి అడ్మిట్ కార్డులు ఆన్ లైన్ ద్వారా జారీ చేస్తామన్నారు. ఆర్మీ కాలింగ్ మొబైల్ యాప్ ద్వారా అభ్యర్థులు తమ సందేహాలను తీర్చుకునే అవకాశం ఉందన్నారు. విశాఖ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయానికి 0891-2756959,0891-2754680 నంబర్ల ద్వారా ఫోన్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్లు సోమవారం నాడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వచ్చేవారం ఈ వ్యవహారంపై వాదనలు విననున్నట్లు సుప్రీంకోర్టు తెలియజేసింది.