Fraud: ఇటలీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నిండా ముంచాడు ఓ కేటుగాడు.. సుమారు 360 మంది నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెట్టి మోసగించాడు ఇచ్చాపురంకు చెందిన ఏజెంట్ కొచ్చెర్ల ధర్మా రెడ్డి. అయితే, ఒక్కొక్కరి దగ్గర నుంచి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేసి.. సుమారు 6 కోట్ల రూపాయలతో విదేశాలకు జంప్ అయ్యాడు కేటుగాడు ధర్మారెడ్డి. హైదరాబాద్ నుంచి ఇచ్చాపురం వరకు బాధితులు ఉన్నారు.
Read Also: Stock Market: ట్రంప్ దెబ్బకు మార్కెట్ కుదేల్.. రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి
అయితే, ఈ ఘటనపై విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ను కలిసేందుకు బాధితులు భారీగా తరలి వచ్చారు. బంగారం, ఇళ్ల స్థలాల మీద అప్పులు తెచ్చి ధర్మారెడ్డి చేతిలో పెట్టి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదని బాధితులు వాపోతున్నారు. గత వారం రోజుల నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్న ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేకపోయినా మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.